Vignesh Shivan: అనిరుధ్ చేసిన ఆ సాయం వల్లే నేడు ఈ స్థాయిలో ఉన్నా.. విఘ్నేష్ శివన్ ఎమోషనల్ కామెంట్స్!

Vignesh Shivan Anirudh Friendship

Vignesh Shivan Anirudh Friendship

ప్రతి ఒక్కరి సక్సెస్ వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయనే దానికి దర్శకుడు విఘ్నేష్ శివన్ జీవితమే ఒక ఉదాహరణ. తాజాగా తన అన్ కమ్మింగ్ మూవీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) ప్రమోషన్లలో భాగంగా ఆయన తన కెరీర్ కష్టకాలం గురించి మాట్లాడుతూ అనిరుధ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.. ‘నానుమ్ రౌడీ దాన్ సినిమా షూటింగ్ ప్రారంభించే సమయంలో నా ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. షూటింగ్ కోసం పాండిచ్చేరి వెళ్లేటప్పుడు నా జేబులో కేవలం బస్సు ఛార్జీల కోసం మాత్రమే ₹250 ఉన్నాయి. ఆ సమయంలో నా స్నేహితుడు అనిరుధ్ ముందుకు వచ్చి చేసిన సాయం మరువలేనిది’ అని విఘ్నేష్ భావోద్వేగానికి లోనయ్యారు.

Also Read : Mrunal Thakur: అతను లేకపోతే నేను లేను.. మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ రివీల్!

అనిరుధ్ కేవలం సంగీతం అందించడమే కాకుండా, విఘ్నేష్‌పై నమ్మకంతో ఆ సినిమా ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి తన వంతు సహకారం అందించారట. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో విఘ్నేష్ శివన్ స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు. నేడు వీరిద్దరి కాంబినేషన్ ‘విక్కీ-అని’ పేరుతో కోలీవుడ్‌లో ఒక బ్రాండ్‌గా మారింది. ప్రస్తుతం విడుదలవుతున్న ‘LIK’ సినిమాకు కూడా అనిరుధ్ తన సంగీతంతో ప్రాణం పోశారు. కష్టాల్లో ఉన్నప్పుడు చేయూతనిచ్చిన స్నేహితుడి గురించి విఘ్నేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి.