NTV Telugu Site icon

Trinadha Rao Nakkina : నిర్మాతగా కొత్త బ్యానర్ స్థాపించిన డైరెక్టర్ త్రినాధరావు నక్కిన ..

Whatsapp Image 2024 02 04 At 2.57.18 Pm

Whatsapp Image 2024 02 04 At 2.57.18 Pm

మాస్ మహారాజ్ రవితేజ తో ధమాకా వంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ దర్శకుడికి  కామెడి,లవ్ సినిమాల పై మంచి పట్టు ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలు చేయడంలో స్పెషలిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నారు.ఆయన గతంలో తెరకెక్కించిన ‘సినిమా చూపిస్తా మామ’, ‘నేను లోకల్ ‘ వంటి చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అలాగే 2022 లోరవితేజతో తెరకెక్కించిన ధమాకా చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ మూవీ లలో ఒకటిగా నిలిచింది. ఈ క్రమంలో ఈ దర్శకుడు తన తరువాత సినిమాను ఏ హీరోతో చేయబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో నాగశౌర్య సొంత బ్యానర్ లో సినిమా చేయనున్నాడనే వార్త వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ఐరా క్రియేషన్స్‌ తో త్రినాథరావు నక్కిన చేతులు కలిపారు.

అయితే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్స్ ఏమీ రాలేదు.. ఈ క్రమంలో మరో వార్త వైరల్ అవుతుంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇప్పుడు నక్కిన త్రినాధరావు తన సొంత బ్యానర్ లో ఓ సినిమా చేయటానికి రంగం సిద్దం చేస్తున్నారు. త్రినాధరావు “నక్కిన నేరేటివ్స్” అనే పేరుతో తాజాగా బ్యానర్ నేమ్ ను ప్రకటించారు. బ్యానర్ కు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు “అనకాపల్లి” అనే సినిమా మీద వర్క్ చేస్తున్నట్లు సమాచారం.. ఈ సినిమా స్క్రిప్టు పూర్తైన తర్వాత ఇద్దరు హీరోలకు వినిపించబోతున్నారని, ఎవరు ఓకే చేస్తే వారితో ముందుకు వెళ్తారని సమాచారం.మరి ఈ దర్శకుడు ఏ హీరోను డైరెక్ట్ చేస్తాడో చూడాలి.