Trinadha Rao Nakkina : నిర్మాతగా కొత్త బ్యానర్ స్థాపించిన డైరెక్టర్ త్రినాధరావు నక్కిన ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజ్ రవితేజ తో ధమాకా వంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ దర్శకుడికి కామెడి,లవ్ సినిమాల పై మంచి పట్టు ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలు చేయడంలో స్పెషలిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నారు.ఆయన గతంలో తెరకెక్కించిన ‘సినిమా చూపిస్తా మామ’, ‘నేను లోకల్ ‘ వంటి చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అలాగే 2022 లోరవితేజతో తెరకెక్కించిన ధమాకా చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ లలో ఒకటిగా నిలిచింది. ఈ క్రమంలో ఈ దర్శకుడు తన తరువాత సినిమాను ఏ హీరోతో చేయబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో నాగశౌర్య సొంత బ్యానర్ లో సినిమా చేయనున్నాడనే వార్త వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ఐరా క్రియేషన్స్ తో త్రినాథరావు నక్కిన చేతులు కలిపారు.
అయితే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్స్ ఏమీ రాలేదు.. ఈ క్రమంలో మరో వార్త వైరల్ అవుతుంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇప్పుడు నక్కిన త్రినాధరావు తన సొంత బ్యానర్ లో ఓ సినిమా చేయటానికి రంగం సిద్దం చేస్తున్నారు. త్రినాధరావు “నక్కిన నేరేటివ్స్” అనే పేరుతో తాజాగా బ్యానర్ నేమ్ ను ప్రకటించారు. బ్యానర్ కు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు “అనకాపల్లి” అనే సినిమా మీద వర్క్ చేస్తున్నట్లు సమాచారం.. ఈ సినిమా స్క్రిప్టు పూర్తైన తర్వాత ఇద్దరు హీరోలకు వినిపించబోతున్నారని, ఎవరు ఓకే చేస్తే వారితో ముందుకు వెళ్తారని సమాచారం.మరి ఈ దర్శకుడు ఏ హీరోను డైరెక్ట్ చేస్తాడో చూడాలి.
Also Read
For the love of cinema &
An ambition to tell touching narratives❤️We are embarking on a new journey with the #NakkinaNarratives banner lead by the blockbuster film maker @TrinadharaoNak1 ❤️🔥
More details coming soon 💥#TrinadhaRaoNakkina @NNOffl_ pic.twitter.com/RxJndwOn0u
— Nakkina Narratives (@NNOffl_) February 4, 2024
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు