Site icon NTV Telugu

Shouryuv: ఆ ఒక్క కారణంతోనే మృణాల్‌ని ఫిక్స్ చేశా.. డైరెక్టర్ శౌర్యువ్ మాటలకు నాని షాక్!

Hi Nanna

Hi Nanna

నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో ‘హాయ్ నాన్న’ ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ మైలురాయి. ముఖ్యంగా ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ పోషించిన ‘యశ్న’ పాత్రకు ఆమె పర్ఫెక్ట్ అని ప్రేక్షకులు సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు శౌర్యువ్ ఈ పాత్ర కోసం మృణాల్‌నే ఎందుకు ఎంచుకున్నారో వివరించారు. ‘మృణాల్ ఠాకూర్ లో ఒక తెలియని అమాయకత్వం, అదే సమయంలో ఒక మెచ్యూరిటీ కనిపిస్తాయి. యశ్న పాత్రకు ఆ రెండూ చాలా అవసరం. అయితే నేను ఆమెను ఎంపిక చేయడానికి చెప్పిన అసలు కారణం విని నాని గారు ఒక్కసారిగా షాక్ అయ్యారు’ అని శౌర్యువ్ పేర్కొన్నారు.

Also Read :Vignesh Shivan: అనిరుధ్ చేసిన ఆ సాయం వల్లే నేడు ఈ స్థాయిలో ఉన్నా.. విఘ్నేష్ శివన్ ఎమోషనల్ కామెంట్స్!

మృణాల్ కళ్లు , ఆమె ఎమోషన్స్ పండించే తీరు, నాని వంటి స్టార్ హీరో పక్కన ఉన్నప్పుడు కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటాయని శౌర్యువ్ నమ్మారట. ‘సీతారామం’ తర్వాత ఆమె ఇమేజ్ ఈ కథకు మరింత బలాన్ని ఇస్తుందని ఆయన భావించారు. దర్శకుడి విజన్ ఎంత కచ్చితంగా ఉందో సినిమా చూశాక అందరికీ అర్థమైంది. నాని కూడా శౌర్యువ్ జడ్జిమెంట్ చూసి ఫిదా అయ్యారట. వీరిద్దరి కాంబినేషన్ లో మరోసారి ఒక క్లాసిక్ సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Exit mobile version