NTV Telugu Site icon

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ అభిమానులకు షాక్.. ఇండియన్ 2లో చందమామ లేదు!

Kajal Aggarwal

Kajal Aggarwal

Director Shankar Said Kajal Aggarwal in Indian 3. స్టార్ డైరెక్టర్ శంకర్‌, విశ్వనటుడు కమల్ హాసన్ కాంబోలో వస్తున్న చిత్రం ‘ఇండియన్ 2’. భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా వస్తోంది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్‌ డేట్ లాక్ చేసుకుంది. జులై 12న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఈ నేపథ్యంలో ఇండియన్ 2 ఆడియో లాంఛ్ కార్యక్రమం చెన్నైలో శనివారం రాత్రి జరిగింది. ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ శంకర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇండియన్ 2 ఆడియో లాంఛ్ ఈవెంట్‌కు మూవీ టీమ్‌తో పాటు పలువురు స్టార్స్ హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కు కాజల్ అగర్వాల్ కూడా హాజరయ్యారు. అయితే ఇండియన్ 2లో కాజల్ కనిపించదని డైరెక్టర్ శంకర్ షాక్ ఇచ్చారు. కాజల్ చేసిన సన్నివేశాలు ఇండియన్ 3లో ఉంటాయని పేర్కొన్నారు. ఈ విషయం తెలిసిన కాజల్ ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు. కమల్ హాసన్‌తో చందమామ తొలిసారి నటించిన విషయం తెలిసిందే. కాజల్ చేసిన సన్నివేశాలు డిలేట్ చేసినట్లు సమాచారం తెలుస్తోంది.

Also Read: Navneet Dhaliwal: అమెరికా, కెనడా మ్యాచ్.. తొలి హాఫ్‌ సెంచరీ మనోడిదే!

ఇండియన్ 2లో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్నారు. ఎస్‌జే సూర్య, బాబీ సింహా, వివేక్, ప్రియా భవానీ శంకర్, బ్రహ్మానందం, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. రెడ్ జెయింట్ మూవీస్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించింది. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు. ఇండియన్ 2 పాటలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

 

 

Show comments