NTV Telugu Site icon

Indian 2 : ఇండియన్ 2 సినిమా చివర్లో డైరెక్టర్ శంకర్ సర్ప్రైజ్ ఇవ్వనున్నాడా..?

Indian2

Indian2

Indian 2 : 1996 సంవత్సరంలో కమలహాసన్ హీరోగా నటించి ప్రభంజనం సృష్టించిన సినిమా ‘భారతీయుడు’. ఈ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు ఇండియన్ 2 సినిమా వస్తున్న సంగతి అందరికీ విధితమే. కమల్ హాసన్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 12న పెద్ద సంఖ్య థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని ప్రమోషన్ కార్యక్రమాలని చేపట్టేసారు. అంతేకాదు అన్ని రకాల ఈవెంట్లను కూడా జరిపించేశారు.

VenkyAnil3 : తొలి షెడ్యూల్ మొదలెట్టేసిన వెంకీ76 సినిమా..

యూనివర్సల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై కేవలం ప్రేక్షకుల్లో మాత్రమే కాకుండా చిత్ర పరిశ్రమల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు శంకర్ సినిమాను హై రేంజ్ లో రూపొందించాడు. సందేశాత్మక చిత్రంగా ఈ సినిమా ఉండనుంది. గత కొన్ని రోజులుగా భారతదేశ వ్యాప్తంగా ఈ సినిమా హడావిడి కనిపిస్తోంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి టికెట్స్ రేట్లు కూడా పెంచేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరణ తెలిపారు. ఇందుకోసం తెలుగు రాష్ట్రాలలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 50 రూపాయలు, అలాగే మల్టీప్లెక్స్ లో 75 రూపాయల మేరకు ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు.

Jr.Ntr : దేవర నుండి అదిరిపోయే న్యూస్..ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..

ఇది ఇలా ఉండగా.. తాజాగా., ఇండియన్ 2 సినిమా రిలీజ్ కాకముందే ఓ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే.. ఇండియన్ 2 సినిమా ఎండ్ టైటిల్స్ తర్వాత మరో ఆరు నెలలలో విడుదల కాబోతున్న ఇండియన్ 3 ట్రైలర్ చూపించబోతున్నట్లు టాక్ వినబడుతోంది. ఇక ఇండియన్ 3 సినిమాకు సంబంధించి ఇప్పటికే విఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాగా.. మరో ఆరు నెలల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం.