NTV Telugu Site icon

Ram Gopal Varma: రామ్‌గోపాల్‌ వర్మ బెయిల్‌ పిటిషన్లపై విచారణ వాయిదా!

Rgv

Rgv

ప్రముఖ రాజకీయ నాయకులపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మకు చుక్కెదురైంది. ఆర్జీవీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. ప్రస్తుతం ఆర్జీవీ పరారీలో ఉన్నాడు. దీంతో ఆర్జీవీ కోసం ఒంగోలు పోలీసులు హైదరాబాద్‌, తమిళనాడులో గాలింపు కొనసాగిస్తున్నారు. రామ్‌గోపాల్‌ వర్మ కోసం ఏపీ పోలీసులు కోయంబత్తూరు వెళ్లినట్టు సమాచారం.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి.. ఎక్స్‌లో పోస్ట్ చేసిన వ్యవహారంలో ఆర్జీవీపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్‌లో కేసు నమోదైంది. విశాఖ, గుంటూరు జిల్లాల్లో కూడా ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో పోలీసులు నోటీసులు పంపినా.. ఆర్జీవీ విచారణకు హాజరుకాలేదు. నవంబర్ 25న తన ఎదుట హాజరు కావాలని విచారణాధికారి నోటీసులు పంపారు. అప్పటికే హైకోర్టులో వర్మ మరోసారి బెయిల్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. ఆయన నుంచి ఎటువంటి సమాచారం లేదు. దాంతో నిన్న ఉదయం 11 గంటల తర్వాత పోలీసులు హైదరాబాద్‌లోని ఆర్జీవీ కార్యాలయానికి వెళ్లారు.

రామ్‌గోపాల్‌ వర్మ పీఏ, మేనేజర్‌తో పోలీసులు మాట్లాడినా ఆయన అందుబాటులోకి రాలేదు. వర్మ ఫోన్‌ కూడా స్విచాఫ్‌ చేసి ఉండటంతో.. ఉద్దేశపూర్వకంగానే తమను తప్పుదారి పట్టిస్తున్నారని పోలీసులు భావించారు. వర్మ కోసం హైదరాబాద్‌తో పాటు తమిళనాడు రాష్ట్రంలో పోలీసులు గాలిస్తున్నారు. 23న కోయంబత్తూరులో షూటింగ్‌లో పాల్గొన్నట్టు నటులతో దిగిన ఫొటోలను ఎక్స్‌లో ట్వీట్ చేశాడు వర్మ. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు వర్మ కోసం కోయంబత్తూరు వెళ్లినట్టు సమాచారం తెలుస్తోంది.

Show comments