కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణంతో పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ‘పునీత్ రాజ్‌కుమార్‌ది ఆకస్మిక మరణం. మనలో ఎవరైనా.. ఎప్పుడైనా చనిపోవచ్చు అనేది భయంకరమైన నిజం. కాబట్టి మనం జీవించి ఉండగానే ఫాస్ట్ ఫార్వార్డ్ మోడ్‌లో జీవించడం ఉత్తమం. మరణానికి ఎలాంటి పక్షపాతం లేదు. అది ఎవరినైనా తన ఇష్టానుసారంగా తీసుకుపోతుంది. చావు అందరికీ సమానమే’ అంటూ తనదైన స్టైలులో రామ్‌గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు.
Read Also: పునీత్ రాజ్‌కుమార్ మృతిపై చంద్రబాబు షాక్
కాగా పునీత్ రాజ్‌కుమార్ కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ తనయుడు అయినప్పటికీ తనను తాను ప్రూవ్ చేసుకుని పవర్ స్టార్ అనే బిరుదు పొందాడు. మంచి డ్యాన్సర్ కూడా కావడంతో పునీత్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పునీత్‌కు 1999లో వివాహమైంది. చిక్‌మంగుళూరుకు చెందిని అశ్వినీని ఆయన పెళ్లి చేసుకున్నాడు. పునీత్-అశ్వినీ దంపతులకు ఇద్దరు కుమార్తులు ఉన్నారు.
