NTV Telugu Site icon

Ram Gopal Varma: రేపు సీఐడీ విచారణ.. ఇన్‌స్పెక్టర్‌కి మెసేజ్ పంపిన రాం గోపాల్ వర్మ

ramgopal-varma

ramgopal varma

రేపు గుంటూరులో సీఐడీ విచారణకు హాజరు కాలేనని సీఐడీకి సమాచారం సినీ దర్శకుడు రాం గోపాల్ వర్మ సమాచారం ఇచ్చాడు. సారీ మూవీ ప్రమోషన్ లో ఉన్న కారణంగా హాజరు కాలేను అని తెలిపాడు. ఈ నెల 28న సినిమా రిలీజ్ ఉండటంతో బిజీగా ఉన్నట్టు పేర్కొన్నాడు. 8 వారాల సమయం కోరాడు. 8 వారాల తర్వాత డేట్ ఇస్తే విచారణకు హాజరు అవుతామని సీఐడీకి తెలిపాడు. సీఐడీ ఇన్‌స్పెక్టర్‌ తిరుమల రావుకి వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చాడు. సీఐడీ చీఫ్ రవి శంకర్ కు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాడు.

READ MORE: Hyderabad: చిలుకూరు ప్రధాన అర్చకుడి ఇంటిపై 20 మంది దాడి.. పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు

ఇదిలా ఉండగా… రాంగోపాల్ వర్మపై గతేడాది ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ ఎక్స్ ఖాతాలో వ్యూహం సినిమా పోస్టర్లు పోస్ట్‌ చేసి చంద్రబాబు, పవన్‌, లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మద్దిపాడుకు చెందిన టీడీపీ నేత రామలింగం ఫిర్యాదు చేసారు. అప్పట్లో విచారణకు రావాల్సిందిగా రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు ప్రకాశం జిల్లా పోలీసులు. కానీ కొన్ని నెలలుగా విచారణకు హాజరు కాకుండా డుమ్మా కొట్టాడు. ఇటీవల.. ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యాడు. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా గతంలో ముందస్తు బెయిల్ తెచుకున్నాడు.

READ MORE: Prince Harry: “ఇప్పటికే భార్యతో కష్టపడుతున్నాడు”.. అతడిని బహిష్కరించనని ట్రంప్ హామీ..