NTV Telugu Site icon

Baahubali: బాహుబలి ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే అప్డేట్..

Bahubali

Bahubali

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బాహుబలి. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. ఇందులో ప్ర‌భాస్, రానా, అనుష్క‌, ర‌మ్య‌కృష్ణ‌, త‌మ‌న్నాలు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇక బాహుబలి 3 త్వరలో విడుదల కానుందని అప్పట్లో గట్టిగానే రూమర్స్ వినిపించాయి. అయితే ఎప్పుడేమి అలాంటివేమీ ఊహించకండి. దర్శకధీరుడు రాజమౌళి ఓ ఆసక్తికరమైన అప్డేట్‌ ను ప్రకటించారు. బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో యానిమేటెడ్ సీక్వెల్ పైప్‌లైన్‌ లో ఉన్నట్లు సమాచారం ఇచ్చారు. అతి త్వ‌ర‌లోనే ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో ఆయన ప్ర‌క‌టించారు.

Also Read: IPL 2024: బీసీసీఐకి షాకిచ్చిన ఈసీబీ.. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ ల‌కు దూరంకానున్న ఇంగ్లాండ్ స్టార్ ఆట‌గాళ్లు..

ఇక ఆయన సోషల్ మీడియా ఖాతా ద్వారా.. మా హిష్మతి ప్రజలు అతని పేరును మంత్రంగా జపించినప్పుడు, ఈ ప్రపంచంలో ఏ శక్తి అతని తిరిగి రాకుండా నిరోధించలేదు. బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేషన్ ట్రైలర్ విడుదలైంది అని తెలిపారు. ఇక బాహుబలిని వేరే రూపంలో తీసుకురావడం సాధ్యం కాదని రాజమౌళి చాలాసార్లు చెప్పిన సంగతి తెలిసిందే. కానీ., ఇప్పుడు వచ్చిన అప్డేట్ తో అది ఏమి చూపిస్తుంది..? అమరేంద్ర బాహుబలి, కట్టప్ప, శివగామి, భల్లాలదేవ, దేవసేన పాత్రలు ఎలా ఉండబోతున్నాయి.? ఇంకా ఏవైనా కొత్త పాత్రలు వస్తాయా..? పూర్తి వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read: OnePlus Nord 4: నయా స్మార్ట్‌ఫోన్ తీసుకరాబోతున్న వన్‌ప్లస్.. ఫీచర్లు ఇవే..

ఇదిలా ఉంటే రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు ప్రధాన పాత్రలో యాక్షన్ అడ్వెంచర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి మనకి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు అతి శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ కూడా అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

Show comments