NTV Telugu Site icon

Dinesh Mahindra : తండ్రి బాటలో తనయుడు.. ప్రముఖ డైరెక్టర్ కుమారుడి దర్శకత్వంలో ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీ!

Dinesh Mahindra

Dinesh Mahindra

ఎన్‌.శంకర్‌.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరిది. శ్రీరాములయ్య, ఎన్‌కౌంటర్‌, జయం మనదేరా, భద్రాచలం, జై భోలో తెలంగాణ వంటి సినిమాలతో సంచలన విజయాలు సాధించారు. అప్పట్లో ఈ సినిమాలకు ప్రేక్షకాదరణ మామూలుగా ఉండేది కాదు.. అదే ఊపుతో ప్రముఖ దర్శకుడు ఎన్‌.శంకర్‌ తనయుడు దినేష్‌ మహీంద్ర కూడా తన తండ్రి బాటలో నడిచేందుకు సిద్ధమయ్యాడు.

READ MORE: Delhi Election : ఫలితాల ముందు ఎన్నికల సంఘం పై ప్రశ్నలు లేవనెత్తిన అరవింద్ కేజ్రీవాల్

తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకోవడానికి ముందుకొస్తున్నాడు. ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో దర్శకత్వ విభాగంలో శిక్షణ పొందిన దినేష్‌ మహీంద్ర, స్క్రీన్‌ప్లే విషయంలో పలు కోర్సులు పూర్తి చేశాడు. త్వరలో ఓ ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీని సైతం తన దర్శకత్వంలో తెరకెక్కించనున్నాడు. కొత్త నటులతో పాటు నూతన టెక్నిషియన్లను పరిచయం చేస్తూ తన చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. యూత్‌ఫుల్‌ ఫీల్‌ గుడ్ లవ్‌స్టోరీగా రూపొందనున్న ఈ చిత్రాన్ని “ఆరెక్స్ క్రియేషన్స్ “ సంస్థ నిర్మిస్తుంది.. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పాటల రికార్డింగ్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.

READ MORE: Steve Smith: స్మిత్ సెంచరీల పరంపర.. ద్రవిడ్, జోరూట్ రికార్డులు సమం