NTV Telugu Site icon

Meher Ramesh: మెగాస్టార్‌ ఇచ్చిన పునర్జన్మ ఇది.. డైరెక్టర్‌గా మళ్లీ పుట్టాను

Meher Ramesh

Meher Ramesh

Meher Ramesh in Bhola Shankar Prerelease Event: మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో, మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికాగా డైరెక్టర్ మెహర్ రమేశ్ తెరకెక్కించిన సినిమా భోళా శంకర్. ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. భోళా శంకర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా దర్శకుడు మెహర్‌ రమేష్‌ సినిమా గురించి కీలక విషయాలు వెల్లడించారు. తాను కూడా మెగా అభిమానుల్లో నుంచి వచ్చానని భోళా శంకర్ డైరెక్టర్‌ మెహర్‌ రమేష్ అన్నారు. మెగాస్టార్‌ సినిమా చేయడం అనేది ఈ జన్మలో చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నానన్నారు. షాడోలో ఉన్న తన మీద మెగాస్టార్‌ వెలుగు పడిందని.. అందుకే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోందన్నారు. డైరెక్టర్‌గా ఈ సినిమా మెగాస్టార్‌ తనకిచ్చిన పునర్జన్మ లాంటిదని ఆయన చెప్పారు. తానెంత ఫ్యాషన్‌తో ఈ సినిమా చేశానో.. నిర్మాత అనిల్ సుంకర అంతే నమ్మకంతో ప్రొడ్యూస్ చేశారని డైరెక్టర్ మెహర్‌ రమేష్ పేర్కొన్నారు. నిర్మాతకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: Hyper Aadi : హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు కానీ హీరోలే ఆయనకి ఫ్యాన్స్..

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఈవెంట్‌ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవిని ఆహ్వానించడానికి వెళ్లినప్పుడు బాస్‌తో సినిమా చేద్దాం అని నిర్మాతతో అన్నానని.. అదే ఇప్పుడు నిజమైందని దర్శకుడు మెహర్‌ రమేష్ పేర్కొన్నారు. కల నిజమైనందుకు సంతోషంగా ఉందన్నారు. సినిమా కూడా అనుకున్న విధంగానే ఎంతో అద్భుతంగా వచ్చిందన్నారు. చిరంజీవి అభిమాని అంటేనే ఒక గుర్తింపు వచ్చిన రోజు నుంచి వచ్చినవాడినన్నారు. చిరంజీవితో బంధుత్వం ఉందని అంటేనే చాలా అదృష్టంగా భావిస్తామన్నారు. అన్నయ్యను తలవని రోజు లేదంటూ మెగాస్టార్‌ మీద ఉన్న అభిమానాన్ని ఆయన వేదికపై ప్రదర్శించారు. ఇవాళ డైరెక్టర్‌గా భోళాశంకర్‌ సినిమా మెగాస్టార్‌తో చేయడం ఆయన తనకిచ్చిన పునర్జన్మగా భావిస్తునన్నారు. రౌడీఅల్లుడు, గ్యాంగ్ లీడర్‌ సినిమాల తర్వాత చిరంజీవి సినిమాల్లో భోళాశంకర్‌ అనేలా ఈ చిత్రాన్ని రూపొందించామన్నారు. మెగాస్టార్‌ చిరంజీవి మీద ఉన్న అభిమానాన్ని చూపించుకోవడానికి ఈ జన్మ సరిపోదన్నారు.