దర్శకుడు మారుతీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..చిన్న సినిమాలతో పెద్ద హిట్స్ అందుకునే దర్శకుడిగా మారుతీకి మంచి పేరుంది.ఈరోజుల్లో సినిమాతో మారుతీ సినీ కెరీర్ మొదలయింది.ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మారుతీ సినిమా తెరకెక్కిస్తున్నారు .గతంలో వచ్చిన సూపర్ హిట్ సినిమాలకు మారుతీ నిర్మాతగా వ్యవహరించారు .గత ఏడాది వచ్చిన సూపర్ హిట్ సినిమాలలో “బేబీ” మూవీ ఒకటి .ఎలాంటి అంచనాలు లేని చిన్న సినిమాగా థియేటర్లలోకి వచ్చిన బేబీ సినిమా సంచలన విజయం సాధించింది.బేబీ మూవీ యూత్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమాలో నటించిన నటీనటులు వైష్ణవి చైతన్య ,విరాజ్ మరియు ఆనంద్ దేవరకొండ కు మంచి పేరు వచ్చింది.అలాగే బేబీ సినిమా టెక్నీషియన్స్ కు కూడా మంచి పేరు వచ్చింది.బేబీ సినిమా నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చి పెట్టింది .
బేబీ సినిమా నిర్మాతల్లో డైరెక్టర్ మారుతి కూడా ఒకరు .ఇప్పుడు మారుతీ నిర్మాతగా మరో ఇంట్రెస్టింగ్ సినిమా వస్తోంది.ఈ ఇంట్రెస్టింగ్ మూవీకి ‘బ్యూటీ’ అని పేరును మేకర్స్ ఫిక్స్ చేసారు .ఈ సినిమాకు సుబ్రహ్మణ్యం ఆర్.వీ దర్శకత్వం వహిస్తున్నారు .జీ స్టూడియోస్‌తో కలిసి మారుతి టీమ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఏ. విజయ్ పాల్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఏప్రిల్ 22న ఈ మూవీని మేకర్స్ లాంఛనంగా ప్రారంభించనున్నారు .అప్పుడే ఈ మూవీ టైటిల్‌ని కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తారు. ‘బేబీ’ సినిమాలో దాదాపు అంతా కొత్తవారే నటించడం అలాగే ఆ సినిమాలో కల్ట్ పాయింట్ యూత్ కి బాగా నచ్చడంతో సినిమా తిరుగులేని విజయం సాధించింది..తాజాగా తెరకెక్కించబోయే ‘బ్యూటీ’ సినిమాని కూడా అదేవిధంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు ‘బేబీ’ ఫేమ్ విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందిస్తున్నట్లు సమాచారం .