Gabbar Singh Rerelease: 2012 మే 11న పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ సినిమా విడుదలైంది. ఆ సమయంలో టాలీవుడ్ లో కలెక్షన్ల పర్వం కొసాగింది. ఇకపోతే., పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఇదే సినిమాను రి రిలీజ్ చేయబోతున్నారు. ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండడంతో.. ఆయన ఫ్యాన్స్ సినిమాను చాలా గ్రాండ్ గా రి రిలీజ్ సెలబ్రేషన్స్ చేయబోతున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా. శృతిహాసన్ హీరోయిన్గా నటించి మెప్పించారు. డైరెక్టర్ హరి శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా 63 కోట్ల రూపాయల వసూలు చేసి అప్పట్లో రికార్డులను సృష్టించింది.
Kalki 2898 AD: మరోసారి గ్లోబల్ లెవెల్లో అదరగొడుతున్న కల్కి..
తాజాగా ఈ సినిమా మళ్లీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రముఖ టాలీవుడ్ వ్యక్తి బండ్ల గణేష్ ను సంధ్య థియేటర్ కి గబ్బర్ సింగ్ చూసేందుకు రావాలని ఓ అభిమాని పిలిచాడు. అయితే ఇందుకు సంబంధించి బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా సమాధానం ఇచ్చాడు. తన బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ తోపాటు తాను వస్తానంటూ తెలిపారు. ఈ సమాధానంకి మళ్ళీ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా రిప్లై ఇచ్చాడు. వెళ్దాం అన్న.. అంటూ హరిశంకర్ సైతం ఎక్స్ లో రిప్లై ఇచ్చారు. ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రిరిలీజ్ అయిన ఇంద్ర సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. మరి పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ తో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో వేచి చూడాల్సిందే.
Come on Anna lets go 🤗🤗 https://t.co/DHoFK2BJsA
— Harish Shankar .S (@harish2you) August 27, 2024
