Site icon NTV Telugu

Gunasekhar :నేను అడగలేదు.. ఫోన్ కూడా చేయలేదు.. మహేష్ బాబు గొప్పతనంపై గుణశేఖర్ ప్రశంసలు!

Mahesh Babu , Gunashekar

Mahesh Babu , Gunashekar

దర్శకుడు గుణశేఖర్ రూపొందించిన లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఈ సినిమా చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు, గుణశేఖర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అయితే దీని వెనుక ఉన్న అసలు విషయాన్ని గుణశేఖర్ బయటపెట్టారు. “నేనేమీ మహేష్ బాబును ‘యుఫోరియా’ చూడమని అడగలేదు, కనీసం ఫోన్ కూడా చేయలేదు. తనంతట తనే సినిమా చూసి నాతో చాలాసేపు మాట్లాడారు. కనకవర్షం కురిపించే ఒక కమర్షియల్ సూపర్ స్టార్‌కు నా సినిమా నచ్చడం అంటే.. అది నాకు నిజంగా కనకవర్షమే!’ అంటూ ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

Also Read : Adivi Sesh: ‘డెకాయిట్’తో నా రూట్ మారుతోంది.. అడివి శేష్ క్లారిటీ

ఒకప్పుడు తనతో భారీ బ్లాక్‌బస్టర్స్ చేసిన మహేష్ బాబు, ఇప్పుడు తన చిన్న సినిమాను కూడా అంతే గౌరవించి ఎంకరేజ్ చేయడం గుణశేఖర్‌ను కదిలించింది.. ‘యూత్ ఫుల్ కంటెంట్ అయినా చాలా పవర్‌ఫుల్‌గా ఉంది’ అని మహేష్ ప్రశంసించినట్లు సమాచారం. ఈ సినిమాతో గుణశేఖర్ మళ్ళీ తన ఫామ్‌లోకి వస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా యువత ఎదుర్కొనే సోషల్ ఇష్యూస్‌ను ఈ సినిమాలో చాలా రా అండ్ రస్టిక్‌గా చూపించారట. మహేష్ బాబు లాంటి స్టార్ సపోర్ట్ దొరకడంతో ‘యుఫోరియా’ కలెక్షన్లపై కూడా సానుకూల ప్రభావం పడే అవకాశం ఉంది.

Exit mobile version