గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాల లైనప్ గురించి చెప్పనక్కర్లేదు.. ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతున్నారు.. ఇప్పటికే ఆయన చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇక రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లోని పాన్ ఇండియా చిత్రం గ్రాండ్ గా ప్రారంభమైన సంగతి తెలిసిందే.. అలాగే సుకుమార్ దర్శకత్వం లో రంగస్థలం 2 చేయబోతున్నారు.. నిన్న రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను మెగా ఫ్యాన్స్ చాలా గ్రాండ్ గా చేశారు.. ఈ సందర్బంగా ఈవెంట్ ను ఏర్పాటు చేశారు..
ఈ కార్యక్రమానికి బుచ్చిబాబు, మైత్రి నిర్మాతలు, దిల్ రాజు, డైరక్టర్ బాబీ, మంచు మనోజ్ వంటి వారు హాజరైయ్యారు.. ఈ సందర్బంగా డైరెక్టర్ బుచ్చిబాబు మాట్లాడుతూ.. రామ్ చరణ్ rc16 నుంచి అదిరిపోయే అప్డేట్స్ ను ఇచ్చారు.. ఈ సినిమా అప్డేట్ కావాలని కోరగా.. బుచ్చిబాబు మాట్లాడుతూ.. ఈ సినిమాలోని మూడు పాటలు కంప్లిట్ అయ్యాయి.. రెహమాన్ సార్ అద్భుతంగా మ్యూజిక్ అందించారు. అందులో మొదటి పాటతో బ్లాస్టింగ్ అయిపోతుంది అంటూ అంచనాలు పెంచేశాడు.
ఫస్ట్ సాంగ్ నుంచే ఆ మొమెంటమ్ మొదలవుతుందని తెలిపాడు. ఆ మాట వినగానే ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు.. బుచ్చిబాబు ఇచ్చిన అప్డేట్స్ సినిమా పై భారీగా అంచనాలను పెంచుతున్నాయి.. ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాను త్వరగా పూర్తి చేసి, తర్వాత సినిమాలను పట్టాలెక్కించాలని రామ్ చరణ్ చూస్తున్నాడు.. చరణ్ పుట్టినరోజు సందర్బంగా రిలీజ్ అయిన జరగండి సాంగ్ యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో దూసుకుపోతుంది..