Site icon NTV Telugu

War 2 Update: చల్ హట్.. యుద్ధానికి ముందు టైగర్‌ను చూశారా?

Ntr War 2

Ntr War 2

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా వస్తున్న ‘వార్ 2’ సినిమాపై భారీ హైప్ ఉంది. కానీ టీజర్‌తో ఆ హైప్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లడంలో ఫెయిల్ అయ్యారు మేకర్స్. గత కొద్ది రోజులుగా ఊరిస్తూ వచ్చిన వార్ 2 టీజర్.. తీరా రిలీజ్ అయ్యాక ఊసురుమనింపించింది. విజువల్స్ పరంగా అనుకున్నంత స్థాయిలో లేదంటూ ట్రోల్స్ కూడా వచ్చాయి. వార్ మొదటి భాగం లాగే.. రొటీన్‌ స్పై థ్రిల్లర్‌గా వార్ 2 ఉండనుందనే కామెంట్స్ వస్తున్నాయి. ఎన్టీఆర్‌కు ఇచ్చిన ఎలివేషన్ విషయంలో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. ఎన్టీఆర్ కంటే హృతిక్ రోషన్‌కే ఎక్కువ ఎలివేషన్ ఇచ్చినట్టుగా ఉందని అంటున్నారు.

ఇటు బిజినెస్ విషయంలోను తెలుగులో వార్ 2కి డిమాండ్ తగ్గినట్టుగా చెబుతున్నారు. మొత్తంగా వార్ 2 టీజర్ అంచనాలను కాస్త తగ్గించేలా చేసింది. దీంతో ఇప్పుడు అసలు సిసలైన వార్ మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో యుద్ధానికి రెడీ అవుతున్న ఎన్టీఆర్ స్టిల్ ఒకటి షేర్ చేశాడు దర్శకుడు. ఎన్టీఆర్‌తో పాటు హృతిక్, కియారా అద్వానీతో ఉన్న స్టిల్స్ కూడా షేర్ చేశాడు అయాన్ ముఖర్జీ. అలాగే వార్ 2 స్క్రిప్ట్ తనని ఎంతో కదిలించిందని రాసుకొచ్చాడు.

Also Read: Peddi Update: పెద్ది.. ఇది అస్సలు ఊహించలేదుగా?

ఇక ఈ పిక్‌లో ఎన్టీఆర్ మస్త్ ఉన్నాడనే చెప్పాలి. దర్శకుడు సీన్ వివరిస్తుండగా.. ఎన్టీఆర్ అలా కూర్చొని అదిరిపోయే స్టైలిష్‌ లుక్‌లో ఉన్నాడు. దీంతో ఇక్కడి నుంచి వార్ 2పై హైప్ పెంచేలా ఎన్టీఆర్‌ను రంగంలోకి దింపాల్సిన అవసరం ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. సౌత్‌తో పాటు అటు నార్త్‌లో కూడా ఎన్టీఆర్ గట్టిగానే ప్రమోట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఇది ఆయన ఫస్ట్ బాలీవుడ్ డెబ్యూ మూవీ కాబట్టి. మరి వార్ 2 ఎలా ఉంటుందో తెలియాలంటే ఆగష్టు 14 వరకు వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version