Site icon NTV Telugu

MSVPG : చిరు ఫ్యాన్స్ తో దర్శకుడు అనిల్ రావిపూడి ఫ్రెండ్లీ మీట్

Anil Ravipudi

Anil Ravipudi

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమా మన శంకర వరప్రసాద్ గారు. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి నుండి వస్తున్నా ఈ సినిమాపై ఇప్పటి నుండే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Also Read : 45TheMovie : తెలుగులో వారం గ్యాప్ లో రిలీజ్ అవుతున్న కన్నడ బిగ్గెస్ట్ మల్టీస్టారర్

వచ్చే ఏడాది సంక్రాంతి కనుకాగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది మన శంకర వరప్రసాద్ గారు.ఈ నేపధ్యంలో మెగాస్టార్ అభిమానులతో మీట్ అండ్ గ్రీట్ నిర్వహించారు దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి. ఫ్యాన్స్ కి గిఫ్ట్ హ్యంపర్లు తో పాటు నూతన సంవత్సర క్యాలండర్స్, మనశంకర వరప్రసాద్ టీ షర్ట్స్..పెన్ తో పాటు స్వీట్స్ మరికొన్ని మరికొన్ని బహుమతులు అందజేశారు. సినిమాకు సంబందించిన ముచ్చట్లతో పాటు ఇతర విశేషాలను కూడా ఫ్యాన్స్ తో పంచుకున్నారు మేకర్స్. అలాగే మెగాస్టార్ చిరు నుండి వింటేజ్ కామెడీ సినిమా వచ్చి చాలా కాలం అయింది ఇప్పుడు అలంటి సినిమాను ఇస్తున్నందుకు దర్శకుడు అనిల్ రావిపూడికి అభినందనలు తెలిపారు. వింటేజ్ స్టైల్ చిరు కామెడీ టైమింగ్ కు అనిల్ రావిపూడి మేకింగ్ కలగలిపి మన శంకర వరప్రసాద్ గారు సూపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Exit mobile version