NTV Telugu Site icon

Dinesh Karthik: ‘ఆ పోస్ట్‌ను డిలీట్ చేయ్’..నెటిజన్‌పై కార్తీక్ సీరియస్ అయ్యాడా?

Saf'l'

Saf'l'

సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ ఉండే క్రికెటర్లలో దినేశ్ కార్తీక్ ఒకడు. ముఖ్యంగా గతేడాది ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కీలక ప్లేయర్‌గా నిలిచాడు. ఫినిషర్‌గా పేరు తెచ్చుకుని టీమిండియాకు రీఎంట్రీ ఇచ్చాడు. టీ20 వరల్డ్‌ కప్‌ జట్టులోను ప్లేస్ దక్కించుకున్నాడు. కానీ అక్కడ కొన్ని మ్యాచ్‌లే ఆడినా తర్వాత మళ్లీ జట్టులో ప్లేస్ కోల్పోయాడు. ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్‌లో తన అభిమానుల కోసం ఓ చాట్ సెషన్ ఏర్పాటు చేశాడు. ఇందులో భాగంగా ఫ్యాన్స్ అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాడీ వెటరన్ వికెట్ కీపర్. అయితే ఈ సమయంలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు డీకే సమాధానం చెప్పలేకపోయాడు. ఆ ఫ్యాన్ చేసిన ట్వీట్‌ను వెంటనే డిలీట్ చేయాలని కోరాడు. అయితే ఇదంతా చాలా ఫన్నీ మూడ్‌లో జరిగినట్లు తెలుస్తోంది.

Also Read: INDvsAUS Test: నాగ్‌పూర్ పిచ్‌ ఫోటోలు వైరల్..లెఫ్ట్యాండ్ బ్యాటర్లకు కష్టమే!

ఇంతకీ ఏమైందంటే.. తనను అభిమానులు ఏమైనా అడగాలని అనుకుంటే వెంటనే అడగాలని డీకే చెప్పాడు. దీంతో చాలా మంది క్రికెట్ గురించి అతని విశ్లేషణలను అడిగాడు. వీరిలో ఒక అభిమాని మాత్రం డీకేను అవమానినంచాడు. 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో న్యూజిల్యాండ్‌పై టీమిండియా ఓడిపోయింది. డీకే కూడా ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో చాలా ఇబ్బందిపడ్డాడు. ఈ క్రమంలో మొత్తం 24 బంతులు ఎదుర్కొన్న డీకే కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. మామూలు మ్యాచుల్లో ఇలాంటి ఇన్నింగ్స్ ఆడితే ఏదో క్షమించేయొచ్చు కానీ.. వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో ఇంత ఘోరంగా ఆడటం ఎలా సాధ్యమైందని సదరు అభిమాని అడిగాడు. ఈ విషయంపై ఏమైనా మాట్లాడాలని చెప్పాడు. అయితే ఇది చూసిన డీకే.. దీన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. ‘ముందు దీన్ని డిలీట్ చెయ్’ అంటూ సరదాగా రియాక్ట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ రెండు ట్వీట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.