Dinesh Karthik: మళ్లీ బ్యాట్ పట్టనున్న దినేష్ కార్తీక్.. తొలి క్రికెటర్‌గా రికార్డు!
- దినేష్ కార్తీక్ పునరాగమనం
- పార్ల్ రాయల్స్ జట్టు తరఫున బరిలోకి డీకే
- తొలి క్రికెటర్‌గా కార్తీక్ రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dinesh Karthik is 1st Indian Player to play in SA 20 League: గత జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పార్ల్ రాయల్స్ జట్టు తరఫున కార్తీక్ బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని పార్ల్ రాయల్స్ మేనేజ్మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడనున్న మొదటి భారత ఆటగాడిగా డీకే రికార్డుల్లో నిలవనున్నాడు.
2004 సెప్టెంబర్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన దినేష్ కార్తీక్.. భారత్ తరపున చివరగా టీ20 ప్రపంచకప్ 2022లో ఆడాడు. భారత్ తరఫున 26 టెస్టుల్లో 1025, 94 వన్డేల్లో 1752, 60 టీ20ల్లో 686 పరుగులు చేశాడు. కీపర్‌గా 172 ఔట్లలో పాలు పంచుకున్నాడు. డీకే ఐపీఎల్లో తనదైన ముద్ర వేశాడు. 257 మ్యాచ్‌లాడి 4842 పరుగులు సాధించాడు. ఐపీఎల్ 2024లో ఆర్సీబీ తరఫున ఆడిన డీకే.. సీజన్ అనంతరం రిటైర్మెంట్ ఇచ్చాడు.
Also Read
- Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
- Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
- Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. 'పెరి పెరి మసాలా'ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
- Six Centuries in One Day: సెంచరీల సండే.. ఒకే రోజులో 6 శతకాలు.. కోహ్లీ, గిల్ సహా దిగ్గజాల విధ్వంసం
Also Read: T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024పై నీలినీడలు.. షార్ట్‌లిస్ట్‌లో భారత్!
ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో దినేష్ కార్తీక్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు జరిగిన 17 ఎడిషన్లలో పాల్గొన్న డీకే.. కేవలం రెండు మ్యాచ్‌లను మాత్రమే మిస్ అయ్యాడు. ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ (2008, 2009, 2010), కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (2011), ముంబై ఇండియన్స్ (2012, 2013), ఢిల్లీ క్యాపిటల్స్ (2014), ఆర్సీబీ (2015), గుజరాత్ లయన్స్ (2016, 2017), కేకేఆర్ (2018, 2019, 2020, 2021), ఆర్సీబీ (2022, 2023, 2024)కి ఆడాడు. ఇక ఐపీఎల్ 2025లో ఆర్సీబీ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా, మెంటార్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ప్రస్తుతం స్కై స్పోర్ట్స్ తరఫున 100 ఫార్మట్ మ్యాచ్‌లకు కామెంటేటర్‌గా ఉన్నాడు.
తాజావార్తలు
-
Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
-
IndiGo Flight: ల్యాండింగ్‌కు ముందు రన్‌వేను తాకిన ఇండిగో విమానం.. గో-అరౌండ్తో తప్పిన ప్రమాదం
-
Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Six Centuries in One Day: సెంచరీల సండే.. ఒకే రోజులో 6 శతకాలు.. కోహ్లీ, గిల్ సహా దిగ్గజాల విధ్వంసం
ట్రెండింగ్
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!