NTV Telugu Site icon

Dinesh karthik: అతడి బౌలింగ్ అంటే కోహ్లీ, రోహిత్‌కు చిరాకు: దినేశ్ కార్తీక్

5

5

గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ వరకూ టీమిండియాలో వరుస అవకాశాలు దక్కించుకున్నాడు సీనియర్ వికెట్ కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్. అనంతరం జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా రాణిస్తున్నాడు. తాజాగా అతడు ఓ షోలో పాల్గొని మాట్లాడాడు. ఈ క్రమంలో తాను నెట్స్‌లో ఎదుర్కొన్న కఠిన బౌలర్‌ మహ్మద్ షమీ అని వెల్లడించాడు. నెట్స్‌లో అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం ‘టార్చర్’అని చెప్పాడు. భారత స్టార్‌ క్రికెటర్లు రోహిత్‌ శర్మ , విరాట్‌ కోహ్లీ కూడా నెట్స్‌లో షమీ బౌలింగ్‌లో ఆడటానికి ఇబ్బందిపడతారని చెప్పాడు.

Also Read: LinkedIn Layoffs: లింక్డ్‌ఇన్‌ ఉద్యోగులకు షాక్.. ఆ ఉద్యోగాల్లో కోత!

“షమీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నేను ‘టార్చర్‌ షమీ’ అని చెబుతా. ఎందుకంటే నా కెరీర్‌ మొత్తంలో ఎదుర్కొన్న కఠినమైన బౌలర్‌ అతడే. నెట్స్‌లో షమీ బౌలింగ్‌లో చాలాసార్లు ఆడాను. కొన్ని మ్యాచ్‌ల్లో ఔట్‌ కూడా చేశాడు. అతడు నెట్స్‌లో చాలా కఠినమైన బంతులు విసురుతాడు. నేనొక్కడినే ఇలా ఇబ్బంది పడుతున్నానా? అనే అనుమానంతో షమీ బౌలింగ్‌ గురించి విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మను అడిగాను. వాళ్లు కూడా షమీ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి ఇష్టపడమని చెప్పారు” అని కార్తీక్ వెల్లడించాడు.

Also Read: WPL 2023: వేలం అద్భుతంగా నిర్వహించింది: మల్లికా సాగర్‌పై ప్రశంసలు

Show comments