NTV Telugu Site icon

Dinesh Karthik: క్రికెట్ కి గుడ్ బై చెప్పిన దినేశ్ కార్తిక్

Dinesh Karthik

Dinesh Karthik

స్టార్ క్రికెటర్ దినేష్ కార్తీక్ క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇటీవల ఐపీఎల్ నుంచి తప్పుకున్న అతడు తాజాగా అన్ని ఫార్మాట్ల క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కార్తీక్ రాణించాడు. కార్తీక్ ఎక్స్‌ ఖాతాలో ‘గత కొన్ని రోజులుగా మీ ఆప్యాయత, మద్దతు, ప్రేమకు నేను పొంగిపోయాను. దీన్ని సాధ్యం చేసిన అభిమానులందరికీ నా కృతజ్ఞతలు, హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా కాలం ఆలోచించిన తర్వాత క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. నేను నా రిటైర్‌మెంట్‌ను అధికారికంగా ప్రకటిస్తున్నాను.’ అని రాసుకొచ్చారు. ఈ క్రమంలో డీకే తన కెరీర్​లో 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ20 మ్యాచ్​లు ఆడాడు.

READ MORE:Car sales may 2024: మే నెలలో ఏ కంపెనీ ఎన్ని కార్లు విక్రయించిందో తెలుసుకోండి

కాగా.. ఇటీవల
టీమిండియా మాజీ వికెట్‌కీపర్‌, బ్యాటర్‌ దినేశ్‌ కార్తీక్‌ కొద్ది రోజుల కిందటే ఐపీఎల్‌కు వీడ్కోలు పలికి వార్తల్లో నిలిచాడు. సుదీర్ఘ ఐపీఎల్‌ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన అనంతరం డీకే క్రికెట్‌ ప్రపంచం మొత్తం నుంచి ఘనంగా సెడాంఫ్‌ను అందుకున్నాడు. క్రికెట్‌కు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి కమిట్‌మెంట్స్‌ లేకపోవడంతో సేద తీరుతున్న డీకే.. భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాతో కలిసి జావెలిన్‌ త్రో ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించాడు. డీకే జావెలిన్‌ త్రో ప్రాక్టీస్‌ చేస్తున్న దృశ్యాలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో బాగా వైరలవుతంది. ఈ వీడియోలో డీకే రెండు ప్రయత్నాల అనంతరం బల్లెంను విజయవంతంగా నిర్దేశిత ప్రాంతం ఆవలికి విసరగలిగాడు. లాస్ట్‌ ఛాన్స్‌ అని నీరజ్‌ను అడిగి మరీ జావెలిన్‌ను అందుకున్న డీకే.. ప్రొఫెషన్‌ అథ్లెట్‌లా రన్‌ అప్‌ తీసుకుని జావెలిన్‌ను సంధించాడు.

Show comments