కొత్త నెల ప్రారంభం కావడంతో  దేశంలోని అన్ని వాహనాల తయారీ కంపెనీలు తమ విక్రయ నివేదికలను వెల్లడించాయి.  

 మోరిస్ గ్యారేజెస్ (MG) మోటార్  మే నెలలో మొత్తం 4,769 యూనిట్లను విక్రయించింది. గతేడాది  మే నెలతో పోలిస్తే సుమారు 5% తక్కువ.

 హోండా మే నెలలో 10,867 యూనిట్లను విక్రయించింది. ఇందులో దేశీయ మార్కెట్‌కు 4,351,  6,516 యూనిట్లు ఎగుమతి.   

 కియా  మే నెలలో మొత్తం 19,500 యూనిట్లు విక్రయించింది. గతేడాదితో పోలిస్తే  3.9% ఎక్కువ.

 మహీంద్రా మే నెలలో 43,218 యూనిట్లను విక్రయించి 31.42% వృద్ధిని నమోదు చేసింది.

టాటా మోటార్స్ గత మే నెలలో దేశీయ మార్కెట్లో మొత్తం 47,075 యూనిట్లను విక్రయించింది.

హ్యుందాయ్-  టాటా మధ్య హోరాహోరీ పోరు కనిపించింది.

హ్యుందాయ్ మే నెలలో మొత్తం 49,151 యూనిట్లను విక్రయించింది.  గతేడాది కంటే 1.13% ఎక్కువ.

మారుతీ సుజుకీ ఎప్పటిలాగే నంబర్ వన్. మే నెలలో  మొత్తం 1,44,002 కార్లను విక్రయించింది.