Site icon NTV Telugu

Cricket Marriage Controversies: స్నేహం–వివాహం–వివాదం! స్నేహితుడి భార్యతో స్టార్ క్రికెటర్..

Cricket Controversy

Cricket Controversy

Cricket Controversies: చాలా మందికి క్రికెట్ అనేది ఒక ఎమోషన్. క్రికెట్ మైదానం అనేది ఎంతో మంది క్రికెటర్లకు గొప్ప స్నేహాలను కానుకగా ఇచ్చింది. కానీ స్నేహం మాటున కొందరు వెన్నుపోటు పొడిచిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అచ్చంగా ఇలాంటి వెన్నుపోటు కథనే ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఒక క్రికెటర్ తన తోటి క్రికెటర్‌కు చేసిన ద్రోహం కారణంగా భార్యాభర్తల సంబంధాన్ని విచ్ఛిన్నం అయ్యింది. ఈ కేసు శ్రీలంకలో వెలుగు చూసింది.

READ ALSO: IndiGo: నార్మలైజ్ అంటే ఇదేనా?.. ఇండిగో సీఈఓ పోస్ట్‌పై నెటిజన్ల ఫైర్

శ్రీలంక మాజీ క్రికెటర్ తిలకరత్నే దిల్షాన్‌కు అతని సహచరుడు ఉపుల్ తరంగ స్నేహం మాటున వెన్నుపోటు పొడిచాడు. వాస్తవానికి ఇది భార్యాభర్తల కేసు. వాస్తవానికి ఉపుల్ తరంగ దిల్షాన్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇది 2008లో జరిగింది. ఆ సమయంలో తిలకరత్నే దిల్షాన్ తన భార్య నీలంక వితనగేకు వివాహేతర సంబంధం ఉందని తెలుసుకున్నాడు. అది కూడా తన సహచర ఆటగాడు ఉపుల్ తరంగతోనే తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకొని దిల్షాన్ మరింత షాక్‌కు గురయ్యాడు. నిజానికి ఈ సంఘటన దిల్షాన్‌ను మానసికంగా కుంగదీసింది.

వీళ్ల బంధం బీటలు వారే సమయానికి వీరికి ఒక కొడుకు ఉన్నాడు. ఈ మొత్తం సంఘటన తర్వాత దిల్షాన్ నీలంక వితనగేకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. విడాకుల తర్వాత దిల్షాన్ తన బిడ్డను తనతో ఉంచుకోడానికి నిరాకరించి, తన మాజీ భార్య వద్ద వదిలేశాడు. విడాకుల తర్వాత నీలంక వితనగే- ఉపుల్ తరంగను వివాహం చేసుకుంది. ఒకప్పుడు శ్రీలంకలో దిల్షాన్ మాజీ భార్య తరంగ వ్యవహారం సంచలనం సృష్టించింది. ఈ సంఘటన వెలుగులోకి వచ్చే సమయానికి దిల్షాన్ శ్రీలంకలో సూపర్ స్టార్. తరంగ ఇంకా తన కెరీర్‌ను నిర్మించుకుంటున్నాడు. దిల్షాన్ విదేశీ పర్యటనల కోసం చాలా కాలం పాటు ఇంటి నుంచి దూరంగా ఉన్నప్పుడు, తరంగ వారి ఇంటిని సందర్శించేవాడని చెబుతారు. ఈ సమయంలోనే నీలంక – తరంగ మధ్య సాన్నిహిత్యం పెరిగి వారిద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారని చెబుతారు. ఇదంతా అయిపోయిన కొంతకాలం తర్వాత దిల్షాన్ మంజుల తిలినిని వివాహం చేసుకొని జీవిత గమనంలో ముందుకు సాగిపోయాడు.

2011 ప్రపంచ కప్‌లో వింతైన సంఘటన..
శ్రీలంక క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలో తిలకరత్నే దిల్షాన్ – ఉపుల్ తరంగ పేర్లు ప్రముఖమైనవి. 2008 సంఘటన తర్వాత కొంతకాలం పాటు, వారు తమ జీవితాలను సాధారణంగానే గడిపారు. అయితే, 2011 ప్రపంచ కప్‌లో శ్రీలంక తరపున కలిసి ఆడినప్పుడు దిల్షాన్ – తరంగ మధ్య ఒక వింత పరిస్థితి ఏర్పడింది. అయితే వారు తమ వ్యక్తిగత విద్వేషాలను పక్కనపెట్టి, దేశం కోసం మైదానంలోకి అడుగు పెట్టి కలిసికట్టుగా పోరాడారు. వీళ్లిద్దరూ అద్భుతమైన ప్రదర్శన చేసి వారి జట్టును ఫైనల్స్‌ వరకు నడిపించారు. కానీ ఫైనల్‌లో శ్రీలంక భారతదేశం చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది.

READ ALSO: IndiGo: ఇండిగోపై చర్యలు తీసుకుంటాం..: కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

Exit mobile version