NTV Telugu Site icon

Dil Raju :జవాన్ సినిమా తెలుగు హక్కుల కోసం ప్రయత్నిస్తున్న దిల్ రాజు..?

Whatsapp Image 2023 07 12 At 11.52.04 Am

Whatsapp Image 2023 07 12 At 11.52.04 Am

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో జవాన్ సినిమా ను చేస్తున్నారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయి లో ఎంతో గ్రాండ్ గా విడుదలవబోతుంది.రీసెంట్ గా షారుఖ్ ఖాన్ నటించిన పాన్ ఇండియా సినిమా పఠాన్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఇండియా వైడ్ గా అత్యధిక వసూళ్లను సాధించిన సినిమా గా పఠాన్ నిలిచింది. దీంతో పాన్ ఇండియా స్థాయిలో షారుఖ్ ఖాన్ నటించిన ‘ జవాన్ ‘ సినిమా త్వరలోనే  విడుదల కాబోతుంది.తెలుగులో స్టార్ హీరోలు ఇప్పటికే పాన్ ఇండియా స్థాయి లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరోలు కూడా వివిధ భాషలలో తమ సత్తాను చాటే ప్రయత్నం చేస్తున్నారు.ఇటీవల బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తెలుగు నేటివిటీ టచ్ చేస్తూ ‘ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ‘ సినిమా ను చేశాడు. ఇది కథ పరంగా అంతగా వర్కౌట్ కాలేదు. అందుకే ఆ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది.

మరో వైపు షారుఖ్ ఖాన్ ఏకంగా తమిళ దర్శకునితోనే జవాన్ సినిమాను చేస్తున్నారు.ఈ సినిమాతో ఎలాగైనా సౌత్ మార్కెట్లో మంచి క్రేజ్ ను పొందాలని చూస్తున్నారు షారుఖ్.. తాజాగా ఈ సినిమాకు దేశవ్యాప్తంగా భారీ స్థాయి లో బిజినెస్ జరిగిందని సమాచారం.తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా హక్కులని కొనుగోలు చేశారని వార్తలు వస్తున్నాయి.సాధారణంగా దిల్ రాజ్ ఒక సినిమాను ఎన్నో అంచనాలు వేసి కొనుగోలు చేస్తారు.షారుఖ్ గత సినిమా పఠాన్ మంచి విజయం సాధించడం తో దిల్ రాజు జవాన్ సినిమాను భారీ ధరకు డీల్ సెట్ చేసుకున్నట్లు తెలిస్తుంది. ఏదేమైనా జవాన్ సినిమా పై దిల్ రాజు భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు వారు చెబుతున్నారు.ఇక ఈ సినిమా పై ఇండియా వైడ్ గా భారీ గా అంచనాలు వున్నాయి.

Show comments