Site icon NTV Telugu

Hanshita Reddy : గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన దిల్ రాజు కూతురు..

Game Changer

Game Changer

Hanshita Reddy : గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ చేంజర్”..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది .అలాగే ఈ సినిమాలో నవీన్ చంద్ర ,సునీల్,జయరాం ,ఎస్.జె.సూర్య వంటి తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన కొన్నికారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమాతో బిజీ గా ఉండటంతో గేమ్ చేంజర్ షూటింగ్ కు బ్రేక్ పడింది.

Read Also :Sriranga Neethulu : ఓటీటీలో కాకుండా నేరుగా యూట్యూబ్ లోకి వచ్చేస్తున్న సుహాస్ మూవీ..

ఇండియన్ 2 మూవీ రిలీజ్ కు సిద్ధం అవడంతో దర్శకుడు శంకర్ గేమ్ చేంజర్ మూవీని పూర్తి చేసే పనిలో వున్నాడు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసి వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టాలి అని దర్శకుడు శంకర్ భావిస్తున్నారు.ఈ సినిమా నుండి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ పోస్టర్స్ ,సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేసాయి.ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు వుంటుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ సినిమా రిలీజ్ పై దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి క్లారిటీ ఇచ్చారు .గేమ్ చేంజర్ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేయనున్నట్లు ఆమె ప్రకటించారు.కానీ రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు.త్వరలోనే మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ పై పూర్తి క్లారిటీ ఇవ్వనున్నారు.

Exit mobile version