Site icon NTV Telugu

Sonia Gandhi : సోనియాగాంధీతో భేటీకానున్న దిగ్విజయ్‌ సింగ్‌

Sonia Gandhi

Sonia Gandhi

కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్ష ఎన్నిక దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ గురువారం ఢిల్లీలో తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవనున్నారు. అయితే కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల నోటఫికేషన్‌ ఈ రోజు విడుదలైంది. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి అక్టోబర్‌ 17న పోలింగ్‌ జరుగనుంది. అయితే.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్‌లు కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీ పడే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే.. అశోక్ గెహ్లాట్ గురువారం సోనియా గాంధీని కలిశారు. ఆనంతరం ఆయన అశోక్‌ గెహ్లాట్‌ మాట్లాడుతూ.. పార్టీ తనకు అప్పగించిన ఏ బాధ్యతకైనా తాను సిద్ధమని ప్రకటించారు.

 

ఆ సమావేశం ముగిసిన తర్వాత దక్షిణాది రాష్ట్రంలో కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’కు నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీతో సమావేశమయ్యేందుకు ఆయన కేరళకు వెళ్లారు. ‘పార్టీ నాకు అన్నీ ఇచ్చింది, హైకమాండ్ అన్నీ ఇచ్చింది. గత 40-50 ఏళ్లుగా నేను వివిధ పార్టీ పదవుల్లో ఉన్నాను. నాకు ఏ పదవి ముఖ్యం కాదు, ఏ బాధ్యతనైనా ఎలా నిర్వహించాలనేదే నాకు ముఖ్యం.” అని అశోక్‌ గెహ్లాట్ తెలిపారు.

 

Exit mobile version