NTV Telugu Site icon

LIC: ఎల్ఐసీ పాలసీని మధ్యలో ఆపేశారా..ఇలా చేస్తే నగదు వాపస్

Licc

Licc

జీవిత బీమా రంగ దిగ్గజం భారతీయ జీవిత బీమా సంస్థ(LIC) తన కస్టమర్లకు ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో రకరకాల ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. గతంలో పాలసీదారులు తాము కడుతున్న పాలసీకి సంబంధించి ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే దగ్గరలోని ఎల్​ఐసీ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. అయితే మొబైల్‌లోనే ఎల్‌ఐసీ సర్వీసులను అందించే.. విధంగా ఎల్​ఐసీ వాట్సాప్ సర్వీసుల్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా పాలసీని మధ్యలో నే ఆపేస్తే..ఆ నగదును తిరిగి ఎలా రాబట్టుకోవాలో చాలా మందికి తెలియదు. దాని గురించి వివరంగా తెలుసుకుందాం..

READ MORE: Viral: ఓరి బడవలరా.. ఇలా తయారయ్యారు ఏంటి.. స్కూల్ ఫంక్షన్ కు ఇలా వచ్చారేంట్రా..

సాధారణంగా జీవిత బీమా పాలసీ తీసుకోవటం ఒక ఎత్తు అయితే దానిని లాప్స్ కాకుండా చూసుకోవటం మరో ఎత్తు. పాలసీ ప్రీమియం కట్టడం మధ్యలోనే ఆపేసిన సందర్బాల్లో ఎల్ఐసీ పాలసీ లాప్స్ అవుతుంది. సాధారణంగా పాలసీకి సంబంధించిన ప్రీమియం దాని గడువు తేదీ లోగా చెల్లించకపోయినా, లేదంటే గడువు తేదీకి అదనంగా ఇచ్చిన గ్రేస్ పీరియడ్ లోపు చెల్లించకపోయినా సదరు పాలసీ లాప్స్ అయిపోతుంది. దీనిని లాప్స్డ్ పాలసీ అంటారు. ఇలా పాలసీ లాప్స్ అయ్యిందంటే దాని నుంచి రావాల్సిన ప్రయోజనాలు నిలిచిపోతాయి. ఇప్పటివరకు కట్టిన ప్రీమియం, పడిన కష్టం వృథా అవుతుంది. అందుకే జీవిత బీమా పాలసీ తీసుకున్నవారు గడువు తేదీ లోగా ప్రీమియం కట్టడం మంచిది. గడువు తేదీ లోగా ప్రీమియం చెల్లించలేని పరిస్థితిలో కనీసం మనకు అందుబాటులో ఉన్న గ్రేస్ పీరియడ్‌లో అయినా సరే ప్రీమియం చెల్లించి పాలసీని ఫోర్స్‌లో ఉంచుకోవాలి.

READ MORE: Amritpal Singh: ఖలిస్తానీ అమృత్‌పాల్ సింగ్‌కి కాంగ్రెస్ ఎంపీ మద్దతు.. బీజేపీ ఆగ్రహం

మరి పాలసీ లాప్స్ అయిన తర్వాత తిరిగి దాన్ని యాక్టీవ్ చేసుకోవచ్చా?అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. అయితే ఎలా అనేది ఇప్పుడు చూద్దాం.. ఒక్కసారి ల్యాప్స్ అయిన పాలసీని రివైవ్ చేయాలంటే, మీరు బకాయి ఉన్న ప్రీమియంలను వడ్డీతో సహా చెల్లించాలి. అలాగే కొన్ని హెల్త్‌ రిక్వైర్‌మెంట్స్‌ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. ల్యాప్స్ అయిన పాలసీని ప్లాన్ నిబంధనల ప్రకారం రివైవ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఎల్ఐసీ కస్టమర్ కేర్ నంబర్, ఈ-మెయిల్ లేదా మీ సమీపంలోని బ్రాంచ్‌ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ఎల్‌ఐసీ సంతృప్తి పడేలా ఎల్‌ఐసీకి మెడికల్ డిక్లరేషన్‌ను సమర్పించాల్సి రావచ్చు. అలాగే బకాయి ఉన్న ప్రీమియంలను నిర్ధిష్ట వడ్డీతో పాటు చెల్లించాలి. మీరు సమర్పించిన డాక్యుమెంట్లు, చెల్లింపులను స్వీకరించిన తర్వాత ఎల్ఐసీ మీ పునరుద్ధరణ రిక్వెస్ట్ ప్రాసెస్ చేసి.. పాలసీకి సంబంధించి కొత్త పత్రాన్ని జారీ చేస్తుంది. అప్పుడు మీ పాలసీని తిరిగి కంటిన్యూ చేసుకోవచ్చు. కాబట్టి ఏదైనా పాలసీ తీసుకునే ముందు పాలసీ గడువు తేదీలు, మెచ్యూరిటీ తేదీ, ప్రీమియం చెల్లింపు గడువు తేదీ, గ్రేస్ పీరియడ్ వంటి అంశాలు ఖచ్చితంగా చూసుకోవాలి. జీవిత భీమా తీసుకునేదే సెక్యూటిటీ కోసం కాబట్టి వీలైనంత వరకు పాలసీ లాప్స్ కాకుండా చూసుకోవడం మంచిది.