Hansika Motwani: చైల్డ్ ఆర్టిస్ట్‌గా గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హన్సిక మోత్వాని తన కెరీర్‌లో చాలా విజయవంతమైన ప్రాజెక్ట్‌లలో పనిచేసింది. హన్సిక చాలా చిన్న వయస్సులోనే టెలివిజన్, బాలీవుడ్ పరిశ్రమలలో పనిచేయడం ప్రారంభించింది. కాస్త పెద్దయ్యాక నేరుగా తెలుగు ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టింది. హన్సిక తన మంచి నటనతో ఎప్పుడూ లైమ్‌లైట్‌లో ఉంటుంది. అయితే ఆమె హార్మోన్ల పెరుగుదల కోసం ఇంజెక్షన్లు తీసుకుంటుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
Read Also:Kharif Fertiliser Subsidy: ఎరువుల ధరలు పెంచొద్దని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
షక లక బూమ్ బూమ్ షోలో బాలనటిగా గుర్తింపు తెచ్చుకున్న హన్సిక.. హృతిక్ రోషన్ తో కలిసి కోయి మిల్ గయా సినిమాలో నటించింది. హన్సికకు వరుసగా ప్రాజెక్టులు రావడంతో ఆమె స్టార్ డమ్ పెరుగుతూ వచ్చింది. కొన్ని రోజుల విరామం తర్వాత, హన్సిక హిమేష్ రేష్మియా మ్యూజిక్ ఆల్బమ్ ఆప్ కా సురూర్‌లో నటించింది. ఆ సమయంలో ప్రజలు ఆమెను చూసి షాక్ అయ్యారు. హార్మోన్ల ఇంజెక్షన్లు తీసుకున్నారని ఆరోపణల పరంపర మొదలైంది. హన్సిక పెద్దగా కనిపించడం కోసం ఆమె తల్లి ఇంజక్షన్ చేయించిందని చెప్పుకొచ్చారు.
Read Also:AP Crime: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. ఏపీలో దారుణ హత్య..
ప్రముఖ నటి హన్సిక చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆమెపై వస్తున్న ఆరోపణలను ఆమె తల్లి మోనా మోత్వాని ఖండించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఎముకల సాంద్రతను పెంచే ఇంజెక్షన్లు ఏమైనా ఉన్నాయా? అయినా ఏ కన్న తల్లి అయినా అలా ఎందుకు చేస్తుంది. హన్సిక విజయాన్ని చూసి ఓర్వలేని వ్యక్తులు డబ్బులు తీసుకుని ఇలాంటి వార్తలు ప్రచురిస్తున్నారు. దీని వెనకున్న వారెవరో మాకు తెలియదు. ఈ వార్తలో ఏ మాత్రం నిజంలేదు’ అని అన్నారు. దీని తర్వాత హన్సిక మాట్లాడుతూ.. ‘సూదులంటే నాకు భయం. ఆ భయంతోనే ఇప్పటివరకు నేను నా శరీరంపై ఒక్క టాటూ కూడా వేయించుకోలేదు. నా ఎదుగుదలను చూసి గిట్టని వాళ్లు అలా ప్రచారం చేస్తున్నారు. సక్సెస్ ఫుల్ గా కెరీర్ రన్ అవుతుండడంతో కడుపుమంటలో ఇలాంటివి చేస్తున్నారు.’ అని హన్సిక మండిపడ్డారు.