ప్రేమకు వయోబేధం ఏమీ లేదు. ఎప్పుడు.. ఎలా? ఎవరిపై ప్రేమ పుడుతుందో చెప్పలేము. మనసులు కలిస్తే చాలు. సంతోషంగా తమ సంబంధాన్ని కొనసాగిస్తుంటారు లవ్ బర్డ్స్. ఇదే రీతిలో ఓ యువతి తనకంటే 51 ఏళ్లు పెద్దవాడైనా వృద్ధుడితో ప్రేమలో పడింది. దీంతో ఈ జంట వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారారు. దీనికి కారణం వారి మధ్య వయసు తేడా. ఎందుకంటే ఆ అమ్మాయి వయసు 25 సంవత్సరాలు కాగా, ఆమె ప్రేమికుడికి 76 సంవత్సరాలు.
Also Read:Kurnool : తీవ్ర విషాదం.. నీటి కుంటలో పడి ఆరుగురు చిన్నారులు మృతి
ఇది శాన్ డియాగోకు చెందిన డయానా మోంటానో స్టోరీ. డైలీ మెయిల్‌తో జరిగిన ఇంటర్వ్యూలో డయానా తన ప్రేమకథ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. నా వయసు 25 సంవత్సరాలు, నా ప్రియుడికి 76 సంవత్సరాలు అని ఆమె చెప్పింది. 51 సంవత్సరాల తేడా ఉన్నప్పటికీ, మేము ఒకరినొకరం సంతోషంగా ప్రేమించుకుంటున్నాం అని తెలిపింది.
డయానా తనకంటే 51 సంవత్సరాలు పెద్దవాడైన తన ప్రేమికుడు ఎడ్గార్‌ను ఎలా కలిసిందో, వారి మధ్య ప్రేమ ఎలా వికసించిందో వివరించింది. అలాగే, ఏజ్ గ్యాప్ కారణంగా వారు సమాజం నుంచి ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించింది. డయానా ప్రకారం, ఆమె ఒక ఉమ్మడి స్నేహితుడి ద్వారా ఎడ్గార్‌ను కలిసింది. అప్పట్లో వారి మధ్య ప్రేమ లాంటిది ఏమీ లేదు. ఆ తర్వాత వారి మధ్య ఏదో జరిగి ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు.
వారిద్దరూ అధికారికంగా జూలై 2024లో వివాహం చేసుకున్నారు. కానీ వారి ప్రేమ వ్యవహారంపై నెటిజన్స్, డయానా సొంత కుటుంబ సభ్యుల నుంచి కూడా వారు తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. మా సంబంధానికి వయసు వ్యత్యాసం అడ్డుకాదని డయానా చెప్పింది. అతనితో ప్రతిదీ చాలా సహజంగా అనిపిస్తుంది. అతను నన్ను గౌరవంగా చూస్తాడని చెప్పింది. తనకు, ఎడ్గార్‌కు చాలా సారూప్యతలు ఉన్నందున కనెక్ట్ అవ్వడంలో ఎటువంటి ఇబ్బంది లేదని నొక్కి చెప్పింది.
Also Read:Chiru Birthday : పవన్ స్పెషల్ విషెస్‌కి.. చిరు అంతే స్పెషల్ రిప్లై !
నా కుటుంబ సభ్యులు కొందరు నా నిర్ణయంతో ఏకీభవించరు. నేను నా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నానని అనుకుంటారు. కానీ ఇది నన్ను పెద్దగా బాధించదు. నా సంబంధం మొదటి చూపులో ఎలా అనిపించవచ్చో నాకు అర్థమవుతుంది. కానీ నేను సంతోషంగా ఉన్నానని నాకు తెలుసని వెల్లడించింది. ఎడ్గార్‌తో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసిన తర్వాత తనకు ఆన్‌లైన్‌లో కొన్ని భయంకరమైన రియాక్షన్స్ వచ్చాయని డయానా తెలిపింది. ఎవరేమనుకున్న మా రిలేషన్ లో హ్యాపీగా ఉన్నామని విమర్శలను పట్టించుకోవలసిన అవసరం లేదని డయానా తెలిపింది.
