NTV Telugu Site icon

Diamond Necklace: చెత్త కుప్పలో దొరికిన డైమండ్ నెక్లెస్.. చివరకి?

Daimond Neclace

Daimond Neclace

Diamond Necklace Found Public Dustbin: ఒక్కసారి ఊహించుకోండి మనకు గాని లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ దొరికితే ఎలాఉంటుందో. ఇక డైమండ్ నెక్లెస్ అందుకున్న తర్వాత ఎవరైనా ఆనందంతో గెంతులేస్తారు. అయితే పోగొట్టుకున్న వారికి వారి వజ్రాల హారం తిరిగి దొరికితే సంతోషం రెట్టింపు అవుతుంది. తమిళనాడులోని చెన్నైలో అచ్చం ఇలాంటిదే జరిగింది. ఓ వ్యక్తి ఇంట్లో ఉంచిన డైమండ్ నెక్లెస్‌ను ప్రమాదవశాత్తు చెత్తకుప్పల్లో పడేశాడు. కానీ., అతనికి ఈ విషయం గుర్తుకు వచ్చేసరికి చాలా ఆలస్యం అయింది. ఆ వ్యక్తి డైమండ్ నెక్లెస్‌ను కనిపెట్టేందుకు సహాయం కోసం మున్సిపల్ కార్పొరేషన్ బృందాన్ని సహాయం అడిగాడు. దాంతో మున్సిపల్ కార్పొరేషన్ బృందం చేసిన కృషి ఫలించింది. చెత్త కుప్పలో దండలో చుట్టి ఉన్న డైమండ్ నెక్లెస్ కనిపించింది.\

Viral Dance: ఢిల్లీ మెట్రోలో మరో కళాఖండం.. చూసారా..?

ఇక పోయిన డైమండ్ నెక్లెస్ చూసిన వెంటనే ఆ వ్యక్తి ఊపిరి పీల్చుకున్నాడు. ఈ విషయం చెన్నైలోని విరుగంబాక్కం ప్రాంతంలో జరిగింది. ఇక్కడ నివాసముంటున్న దేవరాజ్ అనే వ్యక్తి ఇంట్లో ఉంచిన డైమండ్ నెక్లెస్ ప్రమాదవశాత్తూ పోగొట్టుకున్నాడు. దేవరాజ్ తల్లి ఈ డైమండ్ నెక్లెస్‌ని తన కూతురికి పెళ్లి కానుకగా ఇవ్వడానికి తెచ్చిందని., త్వరలో ఆమెకు పెళ్లి జరగాల్సి ఉందన్నారు. డైమండ్ నెక్లెస్ కనపరాకపోవడంతో పొరపాటున నెక్లెస్‌ ను డస్ట్‌బిన్‌లో పడేసిన సంగతి దేవరాజ్‌కి గుర్తుకు వచ్చింది. అయితే అప్పటికి రెండు రోజులు గడిచిపోయాయి. దింతో అతను నెక్లెస్ దొరుకుతుందా లేదా అని దేవరాజ్ కంగారుపడ్డాడు. ముందుగా ఈ విషయంలో మున్సిపల్ కార్పొరేషన్ బృందాన్ని కలిసి వాళ్ళకి విషయం మొత్తం చెప్పాడు.

Shraddha Das: కట్టెల పొయ్యిపై తెగ కష్టపడిపోతున్న హీరోయిన్..

మునిసిపల్ కార్పొరేషన్ బృందం దేవరాజ్‌తో కలిసి చెత్త వేయడానికి వెళ్లిన ప్రదేశానికి చేరుకున్నారు. దేవరాజ్ చెత్త వేసిన ప్రదేశంలో నగరంలోని ఇతర వ్యక్తులు కూడా అక్కడ చెత్తను వేస్తారు. దీంతో అక్కడ చెత్త కుప్పలో కాస్త ఎక్కువగానే చెత్త పేరుకుపోయింది. ఈ చెత్తలో డైమండ్ నెక్లెస్ వెతకాలి. క మునిసిపల్ బృందం తమ పనిని ప్రారంభించింది. చాలా కష్టపడిన బృందం చివరకి ఒక దండలో చుట్టబడిన డైమండ్ నెక్లెస్‌ను కనుగొన్నారు. అది చూసిన దేవరాజ్ ఊపిరి పీల్చుకున్నాడు. మున్సిపల్ కార్పొరేషన్ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ -రిక్షా డ్రైవర్ ఆంథోనిసామి ఈ పనిలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. అతను అక్టోబర్ 2020లో మునిసిపల్ కార్పొరేషన్ నుండి వ్యర్థాల నిర్వహణ కోసం కాంట్రాక్ట్ పొందిన కంపెనీకి ఉద్యోగి. ఇక ఈ డైమండ్ నెక్లెస్ ధర రూ. 5 లక్షలకు పైగా ఉంటుందని దేవరాజ్ తెలిపాడు. ఈ నెక్లెస్ నా సోదరి వివాహానికి బహుమతిగా ఇవ్వాలి. కానీ., చేసిన ఒక్క పొరపాటు వల్ల అది తప్పిపోయింది. ప్రస్తుతం దేవరాజ్ డైమండ్ నెక్లెస్ దరకడంతో చాలా సంతోషంగా ఉన్నాడు.

Show comments