ఏపీలోని కర్నూలు జిల్లాలో ఓ రైతుకు పొలంలో విలువైన ఓ వజ్రం దొరికింది. ఈ మధ్య కురిసిన వర్షాలకు ఆ వజ్రం బయటపడింది. రైతు పొలంలో పనులు చేస్తుండగా., తన కంటపడిన ఓ వజ్రాన్ని రైతు భద్రంగా ఇంటికి తీసుకెళ్లాడు. దింతో విషయం తెలిసిన కొందరు వ్యాపారులు ఆయన ఇంటి వద్ద క్యూ కట్టారు. ఎలాగైనా ఆ వజ్రాన్ని సొంతం చేసుకోవడానికి అందరూ వజ్రాల వ్యాపారులు పోటీ పడడంతో వేలం వేశారు. దింతో పెరవల్లి ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారస్థుడు వజ్రం కోసం రూ. 5 లక్షల నగదు తోపాటు, 2 తులాల బంగారంను ఇచ్చి ఆ రైతు నుంచి వజ్రాన్ని కొనుగోలు చేసాడు.
KKR vs SRH Final: కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్ ఫైనల్ మ్యాచ్.. తుది జట్లు ఇవే!
ఇకపోతే, బయట మార్కెట్ లో ఆ వజ్రం విలువ దాదాపు రూ.10 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు తోటి వ్యాపారస్తులు. ఇక ప్రతి ఏడాది వర్షాకాలం తొలకరి సమయంలో కర్నూలు జిల్లాలో వజ్రాల కోసం పొలాల్లో రైతులు మాత్రమే కాకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ప్రజలు కూడా అక్కడి భూములలో వెతుకుతుంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా భూమిని బాడుగకు తీసుకుని, కూలీలను పెట్టి వెతికించే వాళ్లు కూడా లేకపోలేదు. దీనికికారణం ఒక్క విలువైన వజ్రం దొరికితే చాలు., దశ మారిపోయే అవకాశం ఉండడంతో రైతులు కూడా వారి పొలాల్లో వజ్రాల కోసం వేట కొనసాగిస్తుంటారు. ఇక తాజాగా కురిసిన వర్షాలకు గాను హంప అనే గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో ఈ విలువైన వజ్రం లభించింది.