రణవీర్ సింగ్ హీరోగా అక్షయ్ ఖన్నా నెగిటివ్ రోల్ లో నటించిన బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ సినిమా ధురంధర్. ఆదిత్య ధార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫస్ట్ రోజు కాస్త మిశ్రమ స్పందన రాబట్టిన మౌత్ టాక్ తో భారీ వసూళ్లు రాబట్టి సెన్సషన్ క్రియేట్ చేసి రికార్డులు బద్దులు కొట్టింది. వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు రూ. 1000 కోట్లు రాబట్టింది ధురంధర్. నేటితో ఈ సినిమా ఎనిమిది వారాలు థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. విడుదలైనప్పటి నుంచి కలక్షన్స్ లో ఎక్కడా డ్రాప్ అవ్వకుండా సాలిడ్ రన్‌ను కొనసాగించిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది.
Also Read : SSMB : మహేశ్ బాబు – సందీప్ వంగా కాంబినేషన్‌లో సినిమా డీటెయిల్స్
థియేటర్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ధురంధర్ ఈ రోజు రాత్రి నుంచే ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ డిజిటల్ విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేసింది. దాంతో పాటూ ఈ చిత్రం అన్‌కట్ వెర్షన్ ను నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేస్తోంది. థియేట్రికల్ వెర్షన్ కు రన్ టైమ్ కారణంగా సెన్సార్ కారణంగా తొలగించిన కొన్ని కీలక సన్నివేశాలు, డైలాగ్స్ ఈ వెర్షన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ధురంధర్ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉండనుంది. థియేటర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ధురంధర్ ఓటీటీలో ఏ మేరకు రెస్సాన్స్ తెచ్చుకుందో చూడాలి.
