Dhurandhar: కొత్త సంవత్సరం స్టార్ట్ అయ్యింది, కానీ ఇప్పటికీ అందరి నోట ఒకే సినిమా పేరు వినిపిస్తోంది.. ఇంతకీ ఆ సినిమా పేరు ఏంటో తెలుసా.. “ధురంధర్.” ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో ఈ సినిమా 28 రోజుల్లో రూ.739 కోట్లు వసూలు చేసింది. అయితే అతిపెద్ద హిందీ చిత్రంగా నిలిచేందుకు “ధురంధర్” సినిమా పుష్ప 2 రికార్డ్‌ను బ్రేక్ చేసి భారతదేశంలో రూ.800 కోట్లకు పైగా వసూలు చేయాలి. ఇంతకీ ఈ సినిమా న్యూ ఇయర్ రోజున బ్రేక్ చేసిన ఆ 5 రికార్డ్‌లు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Kanaka Durga Temple: బెజవాడ దుర్గమ్మ ఆలయం కీలక నిర్ణయం.. వీఐపీ, వీవీఐపీలు టికెట్స్ కొనాల్సిందే..!
“ధురంధర్” సినిమా ఇప్పటికి 29 రోజులుగా థియేటర్లలో నడుస్తోంది. గత 28 రోజులుగా సినిమా వసూళ్లు చూస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. న్యూ ఇయర్‌కు రిలీజ్ అయిన కొత్త సినిమాల వల్ల ఈ సినిమా సింగిల్ స్క్రీన్‌లపై ప్రదర్శనలు తగ్గాయి. అయితే అది “ధురంధర్” తుఫాను ఆపేలా లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమా సెకండ్ పార్ట్ మార్చి 19న విడుదల కానుంది. ఈ పార్ట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నూతన సంవత్సరంలో ధురంధర్ సృష్టించిన 5 రికార్డులు ఇవే..
1. అతిపెద్ద చిత్రం: బాలీవుడ్‌లో 28వ రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన హిందీ చిత్రాల జాబితా తాజాగా విడుదలైంది. ఈ జాబితాలో ధురంధర్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ సినిమా 28వ రోజు రూ.15.75 కోట్లు వసూలు చేసింది.
2. నాలుగు రూ.1000 కోట్ల సినిమాలను అధిగమించింది: 28వ రోజు ధురంధర్ సినిమా నాలుగు రూ.1000 కోట్ల సినిమాల రికార్డ్‌లను బ్రేక్ చేసింది. 28వ రోజు ధురంధర్ కంటే తక్కువ వసూళ్లు సాధించిన సినిమాలు ఇవే.. ఈ జాబితాలో రూ.9.5 కోట్లు వసూలు చేసి పుష్ప 2 తర్వాత స్థానంలో ఉండగా, రూ.2.7 కోట్లతో బాహుబలి 2, రూ.1.86 కోట్లతో జవాన్, రూ.1.85 కోట్లతో KGF 2 ఉన్నాయి.
3. డబుల్ డిజిట్స్: ఈ చిత్రం నూతన సంవత్సర రోజున కూడా తన డబుల్ డిజిట్ వసూళ్ల పరంపరను కొనసాగించింది. వరుసగా 28 రోజులు డబుల్ డిజిట్‌లను సాధించిన అతిపెద్ద చిత్రంగా ధురంధర్ నిలిచింది. జవాన్ లేదా పుష్ప 2 రెండూ దానితో సరితూగలేకపోయాయి. అయితే ఈ చిత్రం ఇలాగే మరొక నెల పాటు ఈ ఘనతను సాధించగలిగితే, అది సరికొత్త రికార్డును సృష్టిస్తుందని సినిమా వర్గాలు చెబుతున్నాయి.
4. నాల్గవ వారంలో 100 కోట్లు: ఈ సినిమా నాల్గవ వారం మొత్తం కలెక్షన్లు ఇటీవల వెల్లడయ్యాయి. సాక్‌నిల్క్ నివేదిక ప్రకారం.. ఈ సినిమా నాల్గవ వారం ముగిసే సమయానికి రూ.100 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. 22వ రోజు ప్రారంభమైన ఈ వారం 28వ రోజు నాటికి 106 కోట్లు కొళ్లగొట్టింది.
5. నాలుగు జాతీయ అవార్డులను గెలుచుకున్న చిత్రాన్ని అధిగమించింది: “ఉరి: ది సర్జికల్ స్ట్రైక్” 28వ రోజు అత్యధిక వసూళ్లు చేసిన హిందీ చిత్రాలలో ఒకటి. 28వ రోజు ఈ సినిమా దాదాపు రూ.2 కోట్ల వసూళ్లు చేయగా, తాజాగా ఈ రికార్డును “ధురంధర్” అధిగమించింది. ఉరి సినిమా మొత్తం నాలుగు జాతీయ అవార్డులను అందుకుంది. ఉత్తమ దర్శకుడు (ఆదిత్య ధార్), ఉత్తమ నటుడు (విక్కీ కౌశల్), ఉత్తమ నేపథ్య సంగీతం (శశ్వత్ సచ్‌దేవ్), ఉత్తమ సౌండ్ డిజైన్ (బిశ్వదీప్ డి. ఛటర్జీ) అవార్డులను గెలుచుకున్న చిత్రాన్ని ధురంధర్ కలెక్షన్ల పరంగా అధిగమించి నయా చరిత్ర సృష్టించింది.
READ ALSO: Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వస్తేనే బీఆర్ఎస్ మనుగడ సాధ్యం..
