Site icon NTV Telugu

Dhurandhar 2 : ఇండియన్ సినిమా పవర్ అంటే ఇది! 45కు పైగా దేశాల్లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచిన ‘ధురంధర్ 2’..

Dhurandhar

Dhurandhar

Dhurandhar 2 : భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై మరోసారి చాటిచెబుతోంది ‘ధురంధర్ 2’. చాలా కాలం తర్వాత ఒక బాలీవుడ్ సినిమా కోసం యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులతో పాటు అంతర్జాతీయ స్థాయిలో మూవీ లవర్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తోందంటే, అది ఈ చిత్రం సృష్టించిన ఇంపాక్ట్ అని చెప్పక తప్పదు. మార్చి 7న జియో స్టూడియోస్ విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

READ ALSO: Egg Prices Fall: కోడి గుడ్డు ధర భారీగా పతనం..

45 దేశాల్లో ట్రెండింగ్..
విడుదలైన కేవలం 48 గంటల్లోనే అన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కలిపి 312 మిలియన్ల వ్యూస్ సాధించి ఈ ట్రైలర్ సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం భారత్‌లోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా 45కు పైగా దేశాల్లో యూట్యూబ్ చార్ట్‌లలో నంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ అవుతూ గ్లోబల్ అటెన్షన్‌ను సొంతం చేసుకుంది ఈ సినిమా. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ జస్కిరత్ సింగ్ రంగీ, హమ్జా అలీ మజారి అనే రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తుండటం సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

రణవీర్ సింగ్‌తో పాటు ఈ చిత్రంలో భారీ తారాగణం అలరించనుంది. ఈ సినిమాలో ఆర్.మాధవన్.. అజయ్ సన్యాల్‌గా వ్యూహాత్మక మాస్టర్‌మైండ్ పాత్రలో కనిపించనున్నారు. ఎస్‌పీ చౌధరి అస్లాంగా పవర్‌ఫుల్ రోల్‌లో సంజయ్ దత్ మెరవనున్నారు. ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్‌గా విలన్ పాత్రలో అర్జున్ రాంపాల్ కనిపించనున్నారు. ‘ఉరి: ద సర్జికల్ స్ట్రైక్’ ఫేమ్ ఆదిత్య ధర్ ఈ హై-ఆక్టేన్ స్పై యాక్షన్ చిత్రానికి కథ, దర్శకత్వం వహించారు. జియో స్టూడియోస్ సమర్పణలో, B62 స్టూడియోస్ బ్యానర్‌పై జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ థర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది.

READ ALSO: Belagavi Honeytrap: లాడ్జీకి పిలిచి ఆ పని చేయమని చెప్పేది.. కట్ చేస్తే అందినకాడికి దోచుకుంది!

Exit mobile version