Site icon NTV Telugu

Dhurandhar 2 : ధురంధర్ 2.. 2వేల కోట్లు మార్క్ అందుకోవడం అసాధ్యం

Dhurandhar 2

Dhurandhar 2

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. బాలీవుడ్ యాక్షన్ సినిమాల లెక్కలను తిరగరాస్తూ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. రణవీర్ సింగ్ కెరీర్‌లోనే అత్యంత భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ఈ సినిమా ప్రస్తుతం మూడవ వారంలో కూడా నిలకడగా కలెక్షన్లను రాబడుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 1650 కోట్లు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి 2026లో అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది.

Also Read : RAAKA : గురువు చేయలేనిది.. శిష్యుడు చేస్తున్నాడా?

తొలి వారంలోనే రికార్డు స్థాయి ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం దేశీయంగా రూ. 1000 కోట్ల మార్కును దాటిన తొలి హిందీ సినిమాగా చరిత్ర సృష్టించింది. కేవలం ఇండియాలోనే కాకుండా నార్త్ అమెరికా వంటి ఓవర్సీస్ మార్కెట్లలో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. మూడవ వారంలో అడుగుపెట్టినప్పటికీ, వర్కింగ్ డేస్‌లో కూడా సింగిల్ డిజిట్ పడిపోకుండా స్టడీగా వసూళ్లను రాబడుతున్నప్పటికి అయినప్పటికీ, ఫైనల్ రన్‌లో రూ. 2000 కోట్ల మార్కును అందుకోవడం ఒకింత కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమా విడుదలై మూడు వారాలు గడవడంతో సహజంగానే థియేటర్ల సంఖ్య మరియు ఆక్యుపెన్సీ కొంత తగ్గింది. దానికి తోడు ఐపీఎల్ ప్రభావం కొంత మేర చూపిస్తోంది. రెండు వేల కోట్ల మార్కును చేరుకోవడానికి ఇంకా రూ. 350 కోట్లు రాబట్టాలి. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే ఈ స్థాయి వసూళ్లు సాధించాలంటే లాంగ్ రన్‌లో అద్భుతాలు జరగాలి. మొత్తానికి ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద ఒక గొప్ప విజయాన్ని అందుకుని భారతీయ సినిమా చరిత్రలో టాప్ 5 అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలవడం ఖాయం. రణవీర్ సింగ్ మాస్ పవర్ మరియు ఆదిత్య ధర్ టేకింగ్ ఈ చిత్రాన్ని మరో లెవల్‌కు తీసుకెళ్లాయని చెప్పాలి.

Exit mobile version