Site icon NTV Telugu

Dhurandhar 2 ‘ధురంధర్ 2’ కోసం అక్కడ బిగ్ స్కెచ్..? సెన్సార్ అడ్డంకులు దాటితే రికార్డులే!

Durandhhar

Durandhhar

ఇటీవల బాలీవుడ్ నుండి విడుదలైన ‘ధురంధర్’ ఎంత సెన్సేషన్ హిట్ అందుకుందో తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వస్తున్న ‘ధురంధర్ 2’ ఈ ఏడాది మార్చి 19న పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఫస్ట్ పార్ట్ సాధించిన సక్సెస్ వల్ల సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మేకర్స్ కూడా ఈసారి మేకింగ్ విషయంలో ఎక్కడా తగ్గకుండా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో సినిమాను రూపొందించారు. అయితే..

Also Read : Krishna Vamsi : సినిమా లేకపోతే మీకు బతుకే లేదు – రివ్యూయర్స్‌పై కృష్ణవంశీ ఫైర్..

మొదటి భాగం విడుదలైన సమయంలో గల్ఫ్ దేశాల్లో సెన్సార్ కారణంగా నిషేధానికి గురైంది. దీనివల్ల నిర్మాతలు సుమారు రూ. 100 కోట్ల రూపాయల వరకు నష్టపోయారు. అయితే, ఆశ్చర్యకరంగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాత గల్ఫ్ దేశాల్లోనే ఈ సినిమాకు అత్యధిక వ్యూస్ రావడం విశేషం. పాకిస్థాన్‌లో కూడా ఈ చిత్రానికి విపరీతమైన ఆదరణ లభించింది. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్న మేకర్స్, ఈసారి గల్ఫ్ దేశాల్లో సెన్సార్ అడ్డంకులు లేకుండా సినిమాను విడుదల చేసేందుకు పక్కా ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ అక్కడ కూడా విడుదలకు అయితే, సినిమా వసూళ్లు సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయం. గతంలో చేసిన చిన్న పొరపాట్లను సరిదిద్దుకుంటూ, వివాదాలకు తావులేకుండా ఈసారి సినిమాను మలిచినట్లు సమాచారం.

Exit mobile version