Site icon NTV Telugu

DhurandharTheRevenge : ధురంధర్ 2 టీజర్ రిలీజ్.. ఇది నూతన భారత దేశం..

Dhurandhar 2

Dhurandhar 2

రణవీర్ సింగ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధార్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్’ బాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో విలన్‌గా అక్షయ్ ఖన్నా నటన సినిమాకు ప్రాణంగా నిలిచింది. వీరిద్దరి మధ్య సాగే మైండ్ గేమ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్‌గా ‘ధురంధర్ రివెంజ్’ రాబోతోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

తాజాగా విడుదలైన టీజర్ అత్యంత ఇంటెన్సివ్‌గా సాగుతూ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతోంది. సినిమాలోని డార్క్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్‌ను ఎలివేట్ చేస్తోంది. రణవీర్ సింగ్ తన మార్క్ ఎనర్జీతో ఆకట్టుకున్నాడు. మొదటి భాగంలో మిగిలిపోయిన లెక్కలను సరిచేయడానికే ఈ ‘రివెంజ్’ డ్రామా రాబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్ చివర్లో రణవీర్ సింగ్ చెప్పిన ‘ఇది నూతన భారతదేశం సరిహద్దులు దాటి ఇంట్లోకి చొరబడుతుంది, దెబ్బ కొడుతుంది’ వంటి డైలాగ్ అదిరింది. ఉరి’ వంటి చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య ధార్, ఈ సీక్వెల్‌ను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ విజువల్స్, అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచాయి. మొదటి భాగం సృష్టించిన రికార్డులను ఈ సీక్వెల్ తిరగరాస్తుందేమో చూడాలి. భారీ అంచనాల మధ్య మార్చి 19న వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ  లాంగ్వేజెస్ లో రిలీజ్ కాబోతుంది.

Exit mobile version