Site icon NTV Telugu

Dhurandhar 2: ధురందర్ 2 లో ఊహించని క్లైమాక్స్‌.. పార్ట్ 3 ఉంటుందా?

Dhurandhar 2

Dhurandhar 2

Dhurandhar 2: రణవీర్ సింగ్ నటించిన మోస్ట్ ఏవైటెడ్ సీక్వెల్ ‘ధురందర్: ది రివెంజ్’. నెలల తరబడి సాగిన ఉత్కంఠకు తెరదించుతూ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి, బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టి్స్తుంది. రణవీర్ సింగ్ పోషించిన హమ్జా అలీ మజారీ (జస్కిరత్ సింగ్ రంగి) పాత్ర చుట్టూ తిరిగే ఈ కథ, క్లైమాక్స్‌లో ఊహించని మలుపులతో సాగింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం క్లైమాక్స్, ఎండ్-క్రెడిట్ సీన్స్‌పై ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. ఆ చర్చకు కారణం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Gold Rates: యుద్ధం వేళ నేటి బంగారం, వెండి ధరలు ఇలా..!

ఉత్కంఠభరితమైన క్లైమాక్స్..
సినిమా చివరి అంకంలో రణవీర్ సింగ్ (హంజా) మురిద్కేకు చేరుకుని మేజర్ ఇక్బాల్‌ను (అర్జున్ రాంపాల్) కలుస్తాడు. బలూచ్ యోధుల సాయంతో లష్కర్-ఎ-తైబా (LeT) శిబిరాన్ని ధ్వంసం చేసే క్రమంలో అతను పాకిస్థాన్ దళాలకు చిక్కుతాడు. చిత్రహింసల తర్వాత హంజా అసలు సిసలు భారతీయ ఏజెంట్ అని వెల్లడవుతుంది. అయితే, అజయ్ సన్యాల్ (ఆర్.మాధవన్) తన తెలివితేటలతో ఒక పాకిస్థానీ జనరల్‌ను బ్లాక్‌మెయిల్ చేసి హంజాను విడిపిస్తాడు.

ఊహించని ట్విస్ట్.. రాకేష్ బేడి పాత్ర!
ఈ సినిమాలో అతిపెద్ద మలుపు జమీల్ జమాలి (రాకేష్ బేడి) పాత్ర. గత 50 ఏళ్లుగా పాకిస్థాన్‌లో ఉంటున్న ఈ సీనియర్ రాజకీయ నాయకుడు నిజానికి ఒక భారతీయ ఏజెంట్ అని తేలడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. జమాలి సాయంతోనే హమ్జా సురక్షితంగా భారతదేశానికి చేరుకుంటాడు. భారత్‌కు తిరిగి వచ్చిన రణవీర్ పాత్ర, పంజాబ్‌లోని తన స్వగ్రామానికి చేరుకుంటుంది. అక్కడ తన కుటుంబాన్ని కలుస్తాడా లేదా తిరిగి గూఢచారిగా తన వృత్తిలోకి వెళ్తాడా అనే సందిగ్ధంలో కథను ముగించారు. చివరి సీన్‌లో రణవీర్ కెమెరా వైపు చూసే చూపు, ప్రేక్షకులలో తదుపరి ఏం జరుగుతుందనే ఉత్కంఠను మిగిల్చింది.

ఎండ్-క్రెడిట్ సీన్స్ విశేషాలు..
సినిమా ముగిసిన తర్వాత రెండు కీలకమైన సీన్లను జోడించారు దర్శకుడు. ఫస్ట్ సీన్.. జస్కిరత్ సింగ్ రంగి గూఢచారిగా ఎలా మారాడో చూపే శిక్షణ మాంటేజ్ ఇది. పోరాటాలు, భాషలు నేర్చుకోవడం, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం, విషాల తయారీలో అతను పొందిన కఠిన శిక్షణను ఇందులో చూపించారు. రెండవ సీన్.. 30 సెకన్ల పాటు సాగే ఈ సీన్‌లో పాకిస్థానీ జనరల్ షానవాజ్ (రాజ్ జుత్షి) తన సైనికులపై ఆగ్రహం వ్యక్తం చేయడం కనిపిస్తుంది. అయితే ఇది కథకు పెద్దగా ప్రాధాన్యత లేని సీన్ అని చెప్పవచ్చు.

పార్ట్ 3 పై క్లారిటీ..
చాలా మంది అభిమానులు పార్ట్ 3 గురించి ప్రకటన ఉంటుందని ఆశించినప్పటికీ, ఈ ఎండ్-క్రెడిట్ సీన్స్‌లో దాని గురించి ఎలాంటి స్పష్టమైన సూచనలు లేవు. కేవలం రణవీర్ పాత్ర యొక్క గతాన్ని, వర్తమానాన్ని వివరించడానికే దర్శకుడు ప్రాధాన్యతనిచ్చినట్లు కనిపిస్తుంది. చూడాలి పార్ట్ 3 పై దర్శకుడి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వస్తుంది అనేది.

READ ALSO: US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు చావుదెబ్బ.. 16 యుద్ధ విమానాలు ధ్వంసం!

Exit mobile version