కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ధ్రువ నక్షత్రం.. ఈ సినిమాను గౌతమ్ వాసు దేవ్ మీనన్ డైరెక్ట్ చేస్తున్నాడు. యంగ్ బ్యూటీ రీతూవర్మ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వరుస గా విడుదల చేసిన తమిళ, తెలుగు ట్రైలర్స్ కు మంచి స్పందన వస్తోంది. తాజాగా చిత్ర యూనిట్ మరో పోస్టర్ ను విడుదల చేశారు.మెడలో స్కార్ప్, బ్లాక్ గాగుల్స్ తో చేతిలో పిస్తోల్ పట్టుకొని స్టన్నింగ్ గా కనిపిస్తున్న విక్రమ్ న్యూ లుక్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేస్తోంది. హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ మరో 8 రోజుల్లో మీ కోసం.. సిద్దంగా ఉండండి.. అంటూ లాంఛ్ చేసిన పోస్టర్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
ముంబై దాడులు జరిగినప్పుడు అక్కడికి ఎన్‌ఎస్‌జీ హెలికాప్టర్ రావడం బాగా ఆలస్యమైంది.. అంటూ సాగే డైలాగ్స్‌తో మొదలైన ధ్రువ నక్షత్రం ట్రైలర్.. సినిమా అతి ముఖ్యమైన మిషన్ నేపథ్యంలో సాగనున్నట్టు హింట్ ఇచ్చేస్తుంది. ఈ చిత్రంలో ఐశ్వర్యారాజేశ్, సిమ్రాన్ మరియు రాధికా ఇతర నటీ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమా పై మరింత ఆసక్తి ని పెంచుతున్నాయి.ఈ చిత్రాన్ని ఒండ్రగ ఎంటర్‌టైన్‌మెంట్, కొండదువోం ఎంటర్‌టైన్‌మెంట్ మరియు ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్స్ పిక్చర్స్ బ్యానర్ల పై సంయుక్తం గా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి హరీష్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. యాక్షన్ స్పై జోనర్ లో వస్తున్న ఈ చిత్రంలో విక్రమ్ జాన్,ధ్రువ్ అనే రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఈ మూవీ నుంచి ఇటీవలే కరిచేకళ్లే చూసి లిరికల్ వీడియో సాంగ్ ను మేకర్స్ విడుదల చేయగా ఆ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ధ్రువ నక్షత్రం నవంబర్ 24 న ప్రపంచవ్యాప్తం గా విడుదల కానుంది.
https://x.com/oruoorileoru/status/1725083917257257449?s=20