Site icon NTV Telugu

Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్‌తో..విక్రమ్ తనయుడు ధ్రువ్ క్రేజీ ప్రాజెక్ట్

Druv Vikram

Druv Vikram

తమిళ ఇండస్ట్రీలో విభిన్న పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో ధ్రువ్ విక్రమ్. ‘మహాన్’, ‘బైసన్’ వంటి చిత్రాలతో నటుడిగా మెప్పించిన ఈ యంగ్ హీరో, ఇప్పుడు నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా. గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన ‘మనసానమహ’ షార్ట్ ఫిలిం దర్శకుడు దీపక్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఒక అందమైన రొమాంటిక్ కామెడీ (Rom-Com) కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో ధ్రువ్ సరసన యంగ్ సెన్సేషన్స్ శ్రీలీల కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read :Allu Arjun:అల్లు అర్జున్ 42 రూల్స్ వివాదం..సారీ చెప్పిన కావేరి

అయితే టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తుండటం విశేషం. సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించే అవకాశం ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే హంపి లేదా ఇతర చారిత్రక ప్రదేశాల నేపథ్యంలో చిత్రీకరణ ప్రారంభం కానుందని సమాచారం. తన తండ్రి విక్రమ్ లాగే ధ్రువ్ కూడా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యేందుకు ఈ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను ఎంచుకోవడం ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్‌గా మారింది.

Exit mobile version