బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’. మార్చి 7న విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. జియో స్టూడియోస్ మరియు B62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ ట్రైలర్, విడుదలైన కేవలం 48 గంటల్లోనే అన్ని ప్లాట్‌ఫామ్‌లలో కలిపి 312 మిలియన్ల వ్యూస్ మార్కును దాటి భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పింది.
Also Read : Tollywood : డిఫరెంట్ స్టోరీలతో వస్తున్న స్టార్ డైరెక్టర్ శిష్యులు..
కేవలం ఇండియాలోనే కాకుండా, ఈ ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చాటుతోంది. దాదాపు 45 కంటే ఎక్కువ దేశాలలో యూట్యూబ్ ట్రెండింగ్ చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలవడం ఈ సినిమాపై ఉన్న అంతర్జాతీయ క్రేజ్ ఏంటో చెప్తోంది. రణవీర్ సింగ్ ఇందులో ‘జస్కిరత్ సింగ్ రంగీ’ మరియు ‘హమ్జా’ అనే పవర్‌ఫుల్ అవతార్లలో కనిపిస్తుండటంతో అభిమానులు థ్రిల్ అవుతున్నారు. మొదటి భాగం సాధించిన భారీ విజయం తర్వాత, ఈ సీక్వెల్ అంతకు మించిన యాక్షన్ మరియు ఎమోషన్స్‌తో ఉండబోతోందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ మరియు అక్షయ్ ఖన్నా వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గత ఏడాది విడుదలైన మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, ఇప్పుడు వస్తున్న సీక్వెల్ అంతకు మించిన రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. మార్చి 19న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
