NTV Telugu Site icon

Game Changer : నేడు గేమ్ ఛేంజర్ ‘డోప్’ సాంగ్ రిలీజ్.. ఏ టైంకు వస్తుందంటే ?

New Project (67)

New Project (67)

Game Changer : గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న పాన్ వరల్డ్ లెవల్లో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన జరగండి, రా మచ్చా మచ్చా, నా నా హైరానా అనే పాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక రీసెంట్‌గా రిలీజ్ చేసిన గ్లింప్స్‌తో అంచనాలు ఆకాశన్నంటిన సంగతి తెలిసిందే. తాజాగా దిల్ రాజు పుట్టిన రోజు సందర్భంగా చిత్రం నుంచి నాలుగో పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

Read Also:Hit And Run Accident: క్రిస్మస్ మార్కెట్‌లో ప్రజలపైకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి, 60 మందికి పైగా

దిల్ రాజు బర్త్ డే సందర్భంగా గేమ్ చేంజర్ మూడో పాట ‘డోప్’ ప్రోమోను రెండ్రోజుల ముందే రిలీజ్ చేశారు. ఇక ఈ ప్రోమోను చూస్తే ఈ పాటను ఏ రేంజ్‌లో శంకర్ పిక్చరైజేషన్ చేశారో అర్థం అవుతోంది. తమన్ ఇచ్చిన బీట్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ సాంగ్ అత్యద్భుతంగా వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇక రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనిపిస్తోంది. ఈ పాటకు తమిళంలో వివేక్, హిందీలో రక్వీబ్ ఆలం సాహిత్యాన్ని అందించారు. తెలుగులో ఈ పాటను తమన్ ఎస్, రోషిణి, పృథ్వీ శ్రుతి రంజని ఆలపించాగా.. తమిళంలో తమన్ ఎస్, అదితీ శంకర్, పృథ్వీ.. హిందీలో తమన్ ఎస్, రాజకుమారి, పృథ్వీ శ్రుతి రంజని ఆలపించారు. పూర్తి పాటను డల్లాస్‌ ఈవెంట్‌లో డిసెంబర్ 21న అంటే నేటి రాత్రి 9 గంటలకు రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇండియాలో ఈ పాట డిసెంబర్ 22న రాత్రి 8 గంటల 30 నిమిషాలకు రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా మాటలను అందించారు.

Read Also:Biggboss 8 : బిగ్ బాస్ విన్నర్ కి ఊహించని కొత్త తలనొప్పి.. ఎక్కడికి వెళ్లినా అదే క్వశ్చన్

Show comments