ఫహాద్ ఫాజిల్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలోని భన్వర్ సింగ్ షెకావత్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్. అందుకే ఆయన నటించిన మలయాళ సినిమాలు తెలుగులో డబ్ అవుతున్నాయి.ముఖ్యంగా ఓటీటీల్లో ఫహాద్ ఫాజిల్ సినిమాలు ఎక్కువగా విడుదల అవుతున్నాయి.. ఫహాద్ ఫాజిల్ నటించిన తాజా సినిమా ధూమమ్. యూ టర్న్ ఫేమ్ పవన్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. కేజీఎఫ్ మరియు కాంతారా వంటి బ్లాక్ బస్టర్ రూపొందించిన హోంబలే ఫిల్మ్స్ ధూమమ్ సినిమాను నిర్మించింది. మలయాళంతో పాటు కన్నడ భాషలో కూడా జూన్ 23న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. అయితే ధూమమ్ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు.. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ధూమమ్ ఇప్పుడు డిజిటల్ విడుదలకు సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను కొనుగోలు చేసింది.జులై 21 నుంచి ధూమమ్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది.. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ధూమమ్ సినిమా లో అపర్ణా బాల మురళి హీరోయిన్‌గా నటించింది. అలాగే అచ్యుత్ కుమార్, వినీత్ వంటి వారు ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాను మలయాళం, కన్నడతో పాటు తెలుగు భాషలలోనూ ధూమమ్ సినిమాను విడుదల చేయాలని భావించారు మేకర్స్. అయితే కొన్ని కారణాల వల్ల తెలుగులో ఈ సినిమా విడుదల కాలేదు..ఓటీటీ లో అయిన తెలుగు వెర్షన్ ఉంటుందో లేదో చూడాలి.ఫహాద్ ఫాజిల్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో పాపులర్ అయ్యారు. ఆయనకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.రీసెంట్ గా పుష్ప ది రూల్ సినిమాలో తన పాత్ర షూటింగ్ పూర్తి చేసుకున్నాడు ఫహద్..
