భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పుట్టినరోజు వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా మహేంద్రుడి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా చేసుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. హైదరాబాద్‌లోని ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో 52 అడుగుల ధోనీ కటౌట్ పెట్టారు. ఇక ఏపీలో అయితే ఏకంగా 77 అడుగుల ధోనీ కటౌట్ పెట్టారు మాహీ వీరాభిమానులు. నందిగామ సెంటర్‌లో ధోనీ 77 అడుగుల కటౌట్‌కి అభిమానులు, పాలాభిషేకం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Gudivada Amarnath: వచ్చే వైఎస్సార్ జయంతి నాటికి.. జగన్ రెండోసారి సీఎం కావాలి..
అయితే మహేంద్ర సింగ్ ధోని కోసం అభిమానులు ఇంత గొప్పగా సెలబ్రేట్ చేస్తే.. ధోనీ మాత్రం చాలా కూల్‌గా పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నాడు. రాంఛీలో తన నివాసంలో మూడు పెంపుడు కుక్కలతో కలిసి కేక్ కట్ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అప్పుడెప్పుడో ఐదు నెలల క్రితం తన ఫామ్‌హౌజ్‌లో పొలం దున్నుతున్న వీడియోను షేర్ చేసిన ధోనీ, బర్త్ డే తర్వాతి రోజు తన కుక్కలతో సెలబ్రేషన్స్ జరుపుకున్న వీడియోను షేర్ చేసాడు. ‘మీ అందరి విషెస్‌కి చాలా థ్యాంక్యూ.. నేను నా బర్త్ డే రోజున ఏం చేశానో చెప్పడానికి ఇది ఓ చిన్న టీజర్’ అంటూ కాప్షన్ ఇచ్చాడు.
PM Modi: కాంగ్రెస్ అంటే దోపిడీ దుకాణం, అబద్ధాల మార్కెట్.. రాజస్థాన్ ర్యాలీలో ప్రధాని
ఈ వీడియో పోస్ట్ చేసిన గంటలోనే 30 లక్షలకు పైగా లైకులు, వేలల్లో లైకులు వచ్చేశాయి. ధోనీ భార్య సాక్షి సింగ్, లవ్ సింబల్స్‌ని కామెంట్ చేయగా.. భువనేశ్వర్ కుమార్ భార్య నుపుర్ నగర్ ‘ఈ రోజు ఇంటర్‌నెట్‌లో ఇదే క్యూటెస్ట్ వీడియో’ అంటూ కామెంట్ చేసింది. అంతేకాకుండా కోలీవుడ్ హీరోయిన్లు ఐశ్వర్యా లక్ష్మీ, రమ్యా పాండియన్ కూడా ధోనీ వీడియోపై ‘తలా’ అంటూ లవ్ ఎమోజీలు కామెంట్లు చేశారు.