NTV Telugu Site icon

MS Dhoni: ఆడింది 3 బాల్సే.. కానీ రికార్డు సాధించాడు.. ధోనీ అంటే అట్లుంటది..

Ms Dhoni

Ms Dhoni

MS Dhoni: ఐపీఎల్‌ 2023 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో చెన్నై సూపర్‌ సింగ్స్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రుతురాజ్‌ గైక్వాడ్(57), ఓపెనర్ డేవాన్‌ కాన్వే(47) అద్భుతంగా రాణించారు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్‌ చివరి ఓవర్లో వచ్చిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అదిరిపోయే సిక్సర్లు బాదడం విశేషం. నాలుగేళ్ల తర్వాత చెపాక్ స్టేడియంలో ఆడిన ధోనీ, తనదైన శైలిలో విధ్వంసకర సిక్స్‌లతో చెలరేగిపోయాడు. ధోనీ రాగానే తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు. రెండో బంతిని కూడా సిక్సర్‌ బాది పాత ధోనీని మరోసారి అభిమానులకు చూపించి వారిని సంతోషపరిచాడు. మూడో బంతిని కూడా సిక్సర్‌ బాదాలని ప్రయత్నించ్ క్యాచ్‌ ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో ధోనీ ఆడింది మూడు బంతులే అయినా ఓ రికార్డు క్రియేట్‌ చేశాడు. అదేంటంటే..

Read Also: RRR: జపాన్ లో ఈ రికార్డ్ బ్రేక్ చెయ్యాలంటే మరో పాతికేళ్లు పడుతుంది

ధోనీ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఐపీఎల్‌ వ్యూవర్‌షిప్‌లో ఓ రికార్డు నమోదు కావడం గమనార్హం. అప్పటి వరకు జియో సినిమాలో మ్యాచ్​ వీక్షకుల సంఖ్య సుమారు కోటి 50 లక్షలు ఉండగా.. మహీ బ్యాటింగ్ చేసిన మూడు బంతుల్లో కోటీ 80 లక్షలకు పెరిగింది. అంటే అతడు క్రీజులోకి రాగానే ఒక్కసారిగా 30 లక్షల సంఖ్య పెరిగింది. తాజా ఐపీఎల్​ సీజన్‌లో ఇదే అత్యధిక వీక్షకుల సంఖ్య కావడం విశేషం. ఈ సీజన్‌లోనే చెన్నై తొలి మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్ చేసినప్పుడు కోటీ 60 లక్షల మంది వీక్షించడం గమనార్హం. అంటే తన రికార్డును తానే బ్రేక్‌ చేసుకున్నాడు. లక్నోతో ఆడిన మ్యాచ్‌లో రెండు వరుస సిక్స్‌లను బాదిన ధోనీ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ ఐపీఎల్‌ లీగ్‌లో 5వేల పరుగుల మార్కును ధోనీ అందుకున్నాడు. ఐపీఎల్ హిస్టరీలో 20వ ఓవర్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. అతడు ఇప్పటి వరకు 20వ ఓవర్‌లో 55 సిక్స్‌లు బాదగా.. కీరన్ పొలార్డ్ 33 సిక్స్‌లను కొట్టాడు.

 

Show comments