NTV Telugu Site icon

Poorna : పూర్ణ అప్పుడే మొదలెట్టేసిందిగా..

Purna

Purna

తెలుగు బుల్లితెరపై టాప్ డ్యాన్స్ షో ఢీ.. ప్రస్తుతం 16 వ సీజన్ జరుపుకుంటుంది.. ఇప్పటి వరకు ఈ షో పదిహేను సీజన్లు పూర్తయ్యాయి. ఈ సారి 16వ సీజన్‌ చాలా స్పెషల్‌గా ఉండబోతుంది. గ్లామర్‌, హంగామా, ఎంటర్‌టైన్‌మెంట్‌ మేళవింపుతో రచ్చ రచ్చ చేసేందుకు వస్తున్నారు. ఈరోజు నుంచి ఈ సరికొత్త సీజన్ ప్రారంభమవుతుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో క్రేజీ సెలబ్రిటీలు సందడి చేయడం హైలెట్ అయ్యింది..ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

ఈ ఎపిసోడ్ కు పూర్ణ హైలెట్ గా నిలిచింది..ఆమె గత సీజన్‌ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. పెళ్లి, ప్రెగ్నెంట్‌ కావడంతో దూరంగాఉన్నారు. ఇప్పుడు నార్మల్‌ స్థితికి రావడంతో మళ్లీ తీసుకొచ్చారు. అప్పుడు హాట్‌గా అలరించిన పూర్ణ ఇప్పుడు బొద్దుగా మారిపోయింది. క్యూట్‌గానూ అయ్యింది.. ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చిన పూర్ణ పసికందును వదిలేసి రావడం పై సోషల్ మీడియాలో విమర్శలు కూడా వినిపిస్తున్నాయి..ఇక ఆమెతోపాటు శేఖర్‌ మాస్టర్‌ జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు..

గత సీజన్‌లో `ఢీ` అంత కిక్‌ ఇవ్వలేదు. స్టార్‌ కమెడియన్లు లేక పోవడం, గ్లామర్‌ డోస్‌ తగ్గడం తో ఆడియెన్స్ అంతగా ఆసక్తి చూపలేదు. గత సీజన్ లో కేవలం శ్రద్ధా దాస్‌ మాత్రమే గ్లామర్‌ సైడ్‌ ఆకట్టుకుంది. కానీ వినోదం మిస్‌ అయ్యింది. దానికి రేటింగ్‌ కూడా తగ్గడంతో ఆ నష్ట నివారణ చర్యలు చేపట్టింది టీమ్‌. ఇప్పుడు ఫుల్‌ ఫ్యాక్డ్ గా `ఢీ ప్రీమియర్‌ లీడ్‌`ని తీసుకురానుండటం విశేషం. మరి ఇది ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి.. యాంకర్ గా ప్రదీప్ కొనసాగుతున్నాడు.. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, నెల్లూరు ల నుంచి నాలుగు టీమ్‌లు చేశారు. వీరిలో `హైదరాబాద్‌ ఉస్తాద్స్`, `బెజవాడ టైగర్స్`, `నెల్లూరు నెరజాణలు`, `ఓరుగల్లు వీరులు` లుగా పేర్లు పెట్టారు.. ఇక ముందు ముందు ఎలా ఆకట్టుకుంటుందో తెలియాలంటే ప్రతి ఎపిసోడ్ ను చూడాల్సిందే..

Show comments