NTV Telugu Site icon

Dhawal Kulkarni: క్రికెట్‌కు రిటైర్మెంట్.. కన్నీటితో మైదానం వీడిన భారత క్రికెటర్!

Dhawal Kulkarni Retirement

Dhawal Kulkarni Retirement

Dhawal Kulkarni Retirement: టీమిండియా క్రికెటర్ ధావల్ కులకర్ణి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో విదర్భతో జరిగిన రంజీ ట్రోఫీ 2024 ఫైనల్ కులకర్ణికి చివరి మ్యాచ్. తన చివరి మ్యాచ్‌లో విదర్భపై చివరి వికెట్ తీసిన కులకర్ణి.. ముంబై జట్టును విజయతీరాలకు చేర్చాడు. రంజీ ట్రోఫీ ఫైనల్‌లో చివరి విదర్భ వికెట్ తీసిన తర్వాత 35 ఏళ్ల కులకర్ణి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

విదర్భతో జరిగిన ఫైనల్‌లో ధావల్ కులకర్ణి తొలి ఇన్నింగ్స్‌లో మూడు, రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ తీశాడు. చివరి మ్యాచ్ ఆడుతున్న కులకర్ణికి.. మ్యాచ్ ముగించాలని ముంబై కెప్టెన్ అజింక్య రహానే బంతిని అందించాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ.. ఉమేశ్ యాదవ్‌ను క్లీన్‌బౌల్డ్ చేసి జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. అనంతరం కులకర్ణి ఎమోషనల్ అయ్యాడు. ఆటగాళ్లను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యాడు. ముంబైలోని ప్రతి ఆటగాడు కులకర్ణికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Also Read: Shreyas Iyer-BCCI: శ్రేయస్‌ అయ్యర్‌‌కు శుభవార్త చెప్పనున్న బీసీసీఐ!

ధావల్ కులకర్ణి తన కెరీర్‌లో 95 ఫస్ట్ క్లాస్, 130 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్ క్లాస్‌ క్రికెట్‌లో 281 వికెట్లు, లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 154 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు భారత్ తరఫున కులకర్ణి 12 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతడు 22 వికెట్లు పడగొట్టాడు. 2014 అరంగేట్రం చేసిన కులకర్ణి.. 2016 తర్వాత అవకాశాలు రాలేదు. ఇక 92 ఐపీఎల్ మ్యాచులలో 86 వికెట్స్ తీశాడు.