Dhavaleswaram Barrage Flood: ధవలేశ్వరం బ్యారేజీకి వరద ఉధృతి.. కొనసాగుతోన్న రెండో ప్రమాద హెచ్చరిక!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhavaleswaram Barrage Flood Update: తూర్పుగోదావరి జిల్లాలోని ధవలేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. బ్యారేజీ వద్ద నీటిమట్టం రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి 14.90 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ధవలేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి 14 లక్షల 40 వేల 381 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం కారణంగా బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్యారేజీ వద్ద నీటిమట్టం 17.75 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. అయితే ఎగువన ఉన్న భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుముఖం పడుతున్నందున, ధవలేశ్వరం వద్ద వరద మట్టం స్వల్పంగా పెరిగిన తర్వాత క్రమంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.
Also Read
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం తగ్గుముఖం పట్టింది. 2 గంటల నుంచి 4 గంటల వరకు 0.5 అడుగులు తగ్గింది. మీటర్లలో 0.27 మీటర్లు తగ్గింది. వాతావరణం మేఘావృతం నుంచి వర్షం, అనంతరం జల్లులుగా మారింది. ప్రస్తుతం నీటి మట్టం ప్రమాద స్థాయి కంటే తక్కువగా ఉండి తగ్గుతున్న ధోరణిలో ఉంది. భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రభావం క్రమంగా తగ్గుతోంది. అయితే దిగువ ప్రాంతాలపై ప్రభావం కొనసాగవచ్చునని అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు