CPI Narayana comments: కర్నాటకలోని పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థల. రెండు దశాబ్దాల్లో అక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే పూడ్చి పెట్టానని పారిశుద్ధ్య ఉద్యోగి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. తన 20 ఏళ్ల సర్వీసులో, వందలాది శవాలను తాను ఖననం చేశానని, కొన్నిటిని డీజిల్ ఉపయోగించి కాల్చానని మంజునాథ ఆలయంలో 1995 నుంచి 2014 వరకు పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఒక వ్యక్తి, జులై 3న దక్షిణ కన్నడ జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ శవాల్లో ఎక్కువగా మహిళలు, మైనర్ బాలికలే ఉన్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సామూహిక ఖనన కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. మృతదేహాలు పూడ్చి పెట్టిన 15 అనుమానిత ప్రదేశాలను పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.
READ MORE: Road Accident: రాఖీ పౌర్ణమి రోజు విషాదం.. చెల్లి వద్దకు రాఖీ కోసం వెళ్తూ అనంత లోకాలకు..
తిరుపతిలో సీపీఐ నారాయణ మాట్లాడుతూ..
తిరుపతిలో శ్రీవారి దర్శనం అనంతరం సీపీఐ నారాయణ ధర్మస్థల అంశంపై మాట్లాడారు.. ధర్మస్థల ట్రస్ట్ ఒక కుటుంబం చేతిలో ఉందని, ట్రస్ట్ సభ్యులు 1980 నుంచి ఇప్పటి వరుకు 500 మంది అమ్మాయిలను రేప్ చేసి చంపేసి ఆలయ ప్రాంగణంలోనే పూడ్చిపెట్టారని ఆరోపించారు. ఘటనపై ప్రజలందరూ ఆందోళన చేస్తే కర్ణాటకలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి విచారణకు సిట్ వేసింది. అదే అక్కడ బీజేపీ సర్కార్ ఉంటే సిట్ వేసింది కాదన్నారు. గుడి కాంపోండ్ వెలుపల తవ్వకాలు చేపడితే ఎముకలు, పుర్రెలు బయటపడుతున్నాయని అన్నారు. అదేమన్న శ్మశాన వాటికనా, లేదా పవిత్ర దేవస్థలమా అని ప్రశ్నించారు. ధర్మస్థల ట్రస్ట్ ఛైర్మన్‌కి బీజేపీ బాసటగా ఉందని, ఆయను బీజేపీ వాళ్లు రాజ్యసభకు ఎంపీగా నామినేట్ చేయించారని తెలిపారు.
1980 లో ట్రస్ట్‌కు ఒక సీపీఎం నాయకుడు పోటీ చేశాడు. ట్రస్ట్ బోర్డుకు సంబంధం లేకుండా లోకల్ బోర్డుకు పోటీ చేయడానికి వీల్లేదన్నారు. దానికి ఆయన ఒప్పుకోలేదు. ఇది జరిగిన ఐదో రోజు ఆయన మైనర్ కుమార్తెను రేప్ చేసి చంపేశారని తెలిపారు. అప్పటి నుంచి ఆ ట్రస్ట్‌లో ఉన్నవాళ్లు ఇవే పనులు చేసుకుంటూ వస్తున్నారని విమర్శించారు. తమ పార్టీ డిమాండ్ ఏమిటంటే వెంటనే ఆ ట్రస్ట్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోని, ట్రస్ట్ బోర్డు సభ్యులందరిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
READ MORE: Sathya Raj : తలమీద కాలు పెట్టే సీన్.. ప్రభాస్ అలా అన్నాడు
